Telugu News » National
Sitaram Idol : అయోధ్య రామ మందిరం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. రామాలయంలో ప్రతిష్టించబోతున్న శ్రీరాముడు, సీతాదేవి విగ్రహాల తయారీ కార్యక్రమం మొదలయింది. సీతారాముల విగ్రహం తయారీ కోసం అత్యంత ప్రత్యేకమైన రాళ్లను నేపాల్ దేశం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వం తెప్పించింది. ఇప్పటికే గోరక్ పూర్ కి చేరుకున్న ఆ అతి పెద్ద పవిత్రమైన రాళ్లు అయోధ్యకు తరలించే కార్యక్రమం జరుగుతుంది. సీతారాముల విగ్రహం తయారీ కోసం నేపాల్ నుండి తెప్పిస్తున్న ప్రత్యేక […]
KS Bhagawan : ఈ నడుమ హిందూ దేవుండ్ల మీద చాలామంది నాస్తికులు, హేతువాదులు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. విమర్శకు కూడా ఒక హద్దు ఉంటుందనేది మర్చిపోయి వారు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాలకు దారి తీస్తున్నాయి. మొన్నటికి మొన్న బైరి నరేశ్ ఉదంతం ఎంత దుమారం రేపిందో చూశాం. ఇక ఆ విషయాన్ని మర్చిపోక ముందే ఇప్పుడు మరో ఉదంతం తెరమీదకు వచ్చింది. ప్రముఖ రచయిత, హేతువాది అయిన కేఎస్ భగవాన్ శ్రీరాముడిపై వివాదాస్పద […]
Narendra Modi : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జేపీ నడ్డా అధ్యక్షతన ఢిల్లీలో జరుగుతున్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 350 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. 37 రాష్ట్రాల బీజేపీ పార్టీ అధ్యక్షులు, కేంద్ర పాలిత ప్రాంతాల అధ్యక్షులు, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఐదుగురు ఉపముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక రోడ్ షో ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశానికి చేరుకున్నారు. […]
Pakistan : పాక్ ఆక్రమిత కశ్మీర్ లో జనాలు ఆందోళన బాట పట్టారు. పాకిస్తాన్ లో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. అతి త్వరలోనే శ్రీలంకలో ఎదురైన పరిస్థితులు పాకిస్తాన్ లో కూడా ఎదురయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రజలకు కనీసం ఆహారపు అవసరాలను కూడా తీర్చలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో పాకిస్తాన్ లో ఉండటం తమ వల్ల కాదు అన్నట్లుగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో […]
Rahul Gandhi : కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా చెప్పుకోవచ్చు. కొన్నాళ్ళ క్రితం వరకూ ఆయనకు ఓ విదేశీ స్నేహితురాలు వుండేది. ఆమెతో రాహుల్ గాంధీ వివాహం జరుగుతుందంటూ ప్రచారం తెరపైకొచ్చింది. కానీ, రాహుల్ ఇప్పటికీ బ్రహ్మచారిగానే వుండిపోయారు. రాహుల్ పెళ్ళెప్పుడు.? అని తరచూ చర్చ జరుగుతుంటుంది. సల్మాన్ ఖాన్ తరహాలోనే రాహుల్ కూడా పెళ్ళి చేసుకునే ఆలోచన వున్నట్లు కనిపించరు. భార్య ఎలా వుండాలంటే.. తాజాగా తన భార్య ఎలా […]
Charles Sobhraj : చార్లెస్ శోభరాజ్ పేరు గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియదు. సినిమాల్లో కామెడీగా ఇతని పేరుని అడపా దడపా వాడుతుంటారు. బికినీ కిల్లర్‌గా ఇతని పేరు ఒకప్పుడు మార్మోగిపోయింది. అత్యంత కిరాతకంగా హత్యలు చేస్తాడంటూ ఛార్లెస్ శోభరాజ్ గురించి కథలు కథలుగా చెబుతారు.. నిన్నటితరానికి చెందినవారు. నేపాల్ సుప్రీంకోర్టు ఛార్లెస్ శోభరాజ్‌ని విడుదల చేయాలని ఆదేశించింది. 78 ఏళ్ళ చార్లెస్ శోభరాజ్, దాదాపు 19 ఏళ్ళుగా నేపాల్‌లోని ఖాట్మండు జైల్లో వున్నాడు. […]
Actress Jayaprada : సీనియర్ నటి జయప్రద ఎన్నో తెలుగు, హిందీ సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం నటనకు కాస్త దూరంగా వున్నారామె. రాజకీయాల్లోనూ జయప్రద రాణించారు. ఎంపీగానూ పని చేశారు. మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకురాలిగా తన సేవలు అందించాలనుకుంటున్నట్లు పలు సందర్భాల్లో జయప్రద చెప్పారుగానీ, అది సాధ్యపడటంలేదు. నాన్ బెయిలబుల్ వారంట్.. ఎందుకట.? సినీ నటి జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ ప్రత్యేక కోర్టు […]
Covid : మళ్ళీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయ్. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువమంది గుమికూడి వున్నప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలంటోంది కేంద్ర ప్రభుత్వం. అంటే, రాజకీయ పార్టీలకు సంబంధించిన బహిరంగ సభలే కాకుండా, ఇతరత్రా జనసమ్మర్థంగా వున్న చోట్ల కూడా మాస్క్ తప్పనిసరి అన్నమాట. అయితే, భయపడాల్సిందేమీ లేదనీ.. దేశంలో వ్యాక్సినేషన్ సమర్థవంతంగా జరిగిందని, అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదని అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఇటు వైద్య నిపుణులు చెబుతున్నారు. లాక్ డౌన్ తప్పదా..? […]
Ferrari Car : ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన కార్లలో ఫెరారీ కార్లు కూడా ఉంటాయని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అలాంటి ఫెరారీ కారు ఒక యాసిడెంట్ లో ఏకంగా రెండు ముక్కలవ్వడం ప్రపంచ వ్యాప్తంగా కార్ల వినియోగదారులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంతో పెద్ద యాక్సిడెంట్ అయితే తప్పితే అలా కారు రెండు ముక్కలవ్వడం జరగదు. అది కూడా ఫెరారీ కారు రెండు ముక్కలు అవ్వడానికి అది ఒక భారీ యాక్సిడెంట్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటి […]
China : భారత్ చైనా మధ్య ఎప్పుడు సరిహద్దు విభాగం కొనసాగుతూనే ఉంది. భారత్ చర్చలతో వివాదం సర్దుమనగాలని చూస్తూ ఉంటే చైనా మాత్రం దాన్ని అలుసుగా తీసుకొని దూసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. డిసెంబర్ 9వ తారీఖున భారత్ మరియు చైనా సరిహద్దు వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుండి మళ్లీ బోర్డర్ లో యుద్ధ వాతావరణం కమ్ముకుంది. ముఖ్యంగా చైనా టిబెట్ లోని బాండా, […]
Gujarat : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాల్నీ తల్లకిందులు చేస్తూ బీజేపీ ఘనవిజయం సాధించబోతోంది. ఫలితాలు ఏకపక్షంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా, ఆ పరిస్థితి లేదు. బీజేపీ అనూహ్యంగా దుమ్మురేపుతోంది. మరోమారు బీజేపీలో అధికారాన్ని దక్కించుకోబోతోంది. నిజానికి, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రభావం చూపొచ్చనే అభిప్రాయం గతంలో రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపించింది. ఢిల్లీ, పంజాబ్ తరహాలో గుజరాత్‌లోనూ ఆమ్ ఆద్మీ […]
Vladimir Putin : రష్యా అధ్యక్షుడు పుతిన్ తన నివాసంలో మెట్లు దిగుతుండగా జారిపడ్డారట. దీంతో తుంటి ఎముక విరిగి పోయిందని న్యూయార్క్ పోస్టు ఒక కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని సదరు కథనంలో పేర్కొన్నారు. తుంటి ఎముక దెబ్బతిన్న కారణంగా అతని ప్రమేయం లేకుండానే మలమూత్ర విసర్జన జరుగుతుందని అందులో రాసుకోచ్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. గతంలో కూడా పుతిన్ ఆరోగ్య విషయమై అంతర్జాతీయ మీడియా సంస్థలు […]
Bharat Judo Yatra : కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జూడో యాత్రలో మధ్యప్రదేశ్ ప్రభుత్వ టీచర్ పాల్గొన్నారు. ఆ టీచర్ పై విద్యాశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ వేటు వేశారు. మధ్య ప్రదేశ్ లోని కనస్య జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రాజకీయాలకి అతీతంగా సాగుతున్న యాత్ర పాల్గొనేందుకు టీచర్ వెళ్ళగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అంటూ ప్రజా సంఘాల వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. […]
Jayalalitha : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయి ఏళ్ళు గడస్తున్నాయి. కానీ, ఆమె మరణానికి అసలు కారణమేంటన్నది ఇప్పటికీ తేలలేదు. దాదాపు రెండు నెలలకుపైగానే జయలలిత ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడాల్సి వచ్చింది. ఆసుపత్రిలో చేరాక జయలలిత ఎలా వున్నారన్నదానికి సంబంధించి ఎలాంటి ఫొటోలు, వీడియోలు బయటకు రాలేదు. దాదాపు రెండున్నర నెలల హైడ్రామా తర్వాత, జయలలిత పార్దీవ దేహం మాత్రమే ఆసుపత్రి నుంచి బయటకు రావడాన్ని ఇప్పటికీ ఆమె అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. వారసులు వున్నారా.? […]
BJP And Aam Aadmi Party : దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం అయినా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వాడి వేడిగా జరగబోతున్నాయి. గుజరాత్ లో ఇప్పటి వరకు ఆరు సార్లు బిజెపి అధికారంలో దక్కించుకుంది. అద్భుతమైన ఫలితాన్ని దక్కించుకుంటూ గుజరాత్లో బిజెపి నిలిచింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్లో అధికార పగ్గాలు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. […]
Rivaba Jadeja : ఇటీవలే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికల సందడి నెలకొంది. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ, అధికార పీఠమెక్కాలన్న కసితో కాంగ్రెస్ పార్టీ.. ఈ రెండు పార్టీలకూ షాక్ ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ తమ తమ వ్యూహాల్లో నిమగ్నమైపోయాయి. కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ క్రికెటర్ సతీమణి పోటీ చేసేందుకు అవకాశాలు మెండుగా వున్నాయి. ఆమె ఎవరో కాదు, ‘సర్’ జడేజా సతీమణి. అదేనండీ […]
Aam Aadmi Party : ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికార పీఠమెక్కిన ‘సామాన్యుల పార్టీ’ ఆమ్ ఆద్మీ, ఈసారి గుజరాత్ మీద ఫోకస్ పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఎన్నికల నగారా నిన్ననే మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ని నిన్న విడుదల చేయగా, నేడు ఆమ్ ఆద్మీ పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఛాయ్ వాలా ముఖ్యమంత్రి అయ్యారు.. ప్రధాని అయ్యారు.. అంటూ దేశవ్యాప్తంగా బీజేపీ […]
Gujarat Assembly Elections : కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగించింది. వచ్చే నెల.. అంటే డిసెంబర్‌లో రెండు విడతలుగా పోలింగ్ జరగనుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలి దశ పోలింగ్ డిసెంబర్ 1న జరగనుండగా, రెండో దశ పోలింగ్ డిసెంబర్ 5న జరుగుతుంది. తొలి దశలో 89 స్థానాలకు, రెండో దశలో 93 స్థానాలకు పోలింగ్ జరగనుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తంగా 4.9 కోట్ల మంది ప్రజలు […]
Prashant Kishore : ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మమతా బెనర్జీ లాంటి వాళ్ళను గెలిపించడం కోసం పదేళ్ళు వృధా చేసుకున్నాను.. మహాత్మాగాంధీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే బావుండేదని ఇప్పుడు అనుకుంటున్నాను..’ అంటూ రాజకీయ వ్యూహకర్త, ఎన్నికల సలహాదారు, ఐ-ప్యాక్ టీమ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేయడం, రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. ఐ-ప్యాక్ సంస్థ ద్వారా ప్రశాంత్ కిశోర్ కోట్లు గడించారన్నది బహిరంగ రహస్యం. కోట్లు కాదు, వందల కోట్లు.. వేల […]
Gujarat : తీగల వంతెన తెగింది.. 135 మంది జల సమాధి అయిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది. వంద మంది సామర్థ్యం వున్న వంతెనపైకి సుమారు 500 మందిని నిర్వాహకులు ఎలా అనుమతించారన్నది ఓ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దేశాన్ని కుదిపేస్తోంది ఈ ఘటన. గుజరాత్‌లోని మార్బీలోని మచ్చు నదిపై వున్న కేబుల్ బ్రిడ్జి తెగిపోవడంతో చోటు చేసుకున్న ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి కేబుల్ బ్రిడ్జిలు […]
Chhattisgarh Chief Minister Bhupesh Baghel : ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కొరడా దెబ్బలు తిన్నారు. హా.! ఏంటీ ముఖ్యమంత్రి కొరడా దెబ్బలు తినడమేంటీ. ఎక్కడీ చోద్యం.? ఎవరా ముఖ్యమంత్రి.. అనుకుంటున్నారా.? ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు. ఛత్తీస్‌ఘడ్‌లోని జజన్ గిరి, కుమ్హారీ గ్రామాల్లో ఓ వింత ఆచారం వుంది. ప్రతి ఏడాదీ ముఖ్యమంత్రి ఈ జానపద ఆచారాన్ని చాలా సాంప్రదాయ బద్ధంగా పాటిస్తుంటారు. ఈ సారి కూడా ఈ సాంప్రదాయం ఘనంగా […]
Rishi Sunak : రిషి సునాక్ పేరు బ్రిటన్‌లో కంటే భారతదేశంలో ఎక్కువగా మార్మోగిపోతోంది. కారణం ఆయన భారతీయ మూలాలున్న వ్యక్తి కావడమే. ఔను మరి, భారతీయ మూలాలున్న వ్యక్తి బ్రిటన్ ప్రధాని అవడమంటే మామూలు విషయమా.? పైగా, బ్రిటిష్ పాలనలో భారతావని ఒకప్పుడు విలవిల్లాడింది. బ్రిటిష్ పాలకులు భారతావనిని ఎంతలా దోచేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి బ్రిటిషర్లకు ఇప్పుడు మన భారతీయ మూలాలున్న వ్యక్తి ప్రధాని అవుతున్నారు. కుల గోత్రాల సంగతేంటి.? అంతా బాగానే […]
Mallikarjuna Kharge : ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడొచ్చాడు. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇకపై సలహాలు, సూచనలకు మాత్రమే పరిమితమవుతారు. పార్టీ పరంగా పాలనా వ్యవహారాలన్నీ అధ్యక్షుడి హోదాలో మల్లికార్జున ఖర్గేనే చూసుకోవాల్సి వుంటుంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించినట్లుగానే మల్లికార్జున ఖర్గే గెలిచారు. నిజానికి, ఇవి నామమాత్రపు ఎన్నికలే అయితే, కాంగ్రెస్ పార్టీలో ఒకింత ప్రజాస్వామిక పద్ధతిలోనే అంతర్గత ఎన్నికలు జరగడం గమనార్హం. ఎవరు పోటీ చేయాలన్నదానిపై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడింది. […]
India : పండగొచ్చిందంటే చాలు షాపింగ్ చేయాల్సిందే. పండగ సీజన్‌లో షాపింగ్ చేస్తే ఆ కిక్కే వేరప్పా. ఇది భారత్ లెక్క. కానీ, అమెరికా, యూరప్ దేశాలు ఆర్ధికంగా బాగా వెనకబడి వున్నాయని ఓ సర్వే ద్వారా వెల్లడయ్యింది. అధిక వడ్డీ రేట్లు, ధరల పెరుగుదలను తట్టుకోలేక అక్కడి వినియోగదారులు కొనుగోళ్లను తగ్గించేశారట. కానీ, భారత్‌లో మాత్రం అలాంటి ఛాయలేమీ కనిపించడం లేదని తాజా సర్వేలో తేలింది. దేశంలోని ఏ ప్రధాన నగరాలు తీసుకున్నా రిటైల్ షాపులూ, […]
Indian Army Dog Zoom : దేశ భక్తి మనుషులకే కాదండోయ్. శునకాలకూ వుంటుంది. ఇండియన్ ఆర్మీలో ‘జూమ్’ అనే అసాల్ట్ డాగ్ కీలక పాత్ర వహించింది. శత్రువులను మట్టు పెట్టేందుకు ఆర్మీ ఆపరేషన్‌లో పాల్గొన్న ‘జూమ్’ తీవ్రంగా గాయాల పాలవడంతో వీర మరణం పొందింది. ఉగ్రవాదులతో భీకరంగా పోరాడిన జూమ్‌కి రెండు బుల్లెట్లు తగిలాయ్. అది లెక్క చేయకుండానే శత్రువులను మట్టు పెట్టేందుకు తన చివరి శ్వాస వరకూ పోరాడింది జూమ్. యుద్దంలో గెలిచింది. కానీ, […]