Telugu News » Andhra pradesh
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. పార్టీ ప్రారంభించి మొదటి సారి బిజెపి, టిడిపికి మద్దతు ఇచ్చిన జనసేన ఆ తర్వాత 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని మూట కట్టుకోవాల్సి వచ్చింది. అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓటమిపాలయ్యాడు. ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలుపొందిన విషయం కూడా […]
Gangavva : మై విలేష్ షో గంగవ్వ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అరవై ఏండ్ల వయసులో కూలీ పని చేసుకునే గంగవ్వ యూట్యూబ్ స్టార్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి చాలామందికి చేరువయింది. అప్పటి నుంచి అప్పుడప్పుడు టీవీల్లో కూడా కనిపిస్తూనే ఉంటుంది. అయితే తాజాగా గంగవ్వ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. నన్ను క్షమించండి. నాకు జ్ఞానం లేదు. చదువు రాదు. నాకు […]
YS Jagan Mohan Reddy : 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఘనవిజయం సాధించి నాలుగు సంవత్సరాలైన సందర్భంగా వైకాపా సోషల్ మీడియా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు #YSRCPAgain2024 హ్యాష్ ట్యాగ్‌తో ట్విటర్ లో ట్రెండింగ్‌ను చేశారు. హ్యాష్ ట్రెండింగ్ ప్రారంభమైన పది నిమిషాల్లోనే జాతీయ స్థాయిలో ఈ హ్యాష్ ట్యాగ్ మొదటి స్థానంలో నిలిచింది. తన నాలుగేళ్ళ పాలనలో వైయస్ జగన్ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు ఆయన రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన సమాచారంతో కూడిన […]
Rapaka Varaprasad : జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు. అయితే గెలిచినప్పటి నుంచి ఆయన చేస్తున్న పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. జనసేన పార్టీ నుంచి ఆయన ఇప్పుడు వైసీపీ మద్దతుదారుడిగా మారిపోయారు. ఇప్పటికే వైసీపీ మీటింగ్ లకు కూడా అటెండ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన కుమారుడి పెండ్లి పత్రిక నెట్టింట్లో వైరల్ అవుతోంది. రాపాక వరప్రసాద్, నాగరత్నం దంపతుల […]
CM Jagan Mohan Reddy : ఏపీ సీఎం జగన్ ఇప్పటికే ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు చేపడుతున్నారు. ముఖ్యంగా అమ్మఒడి , వైఎస్సార్ భరోసా, నాడు-నేడు లాంటి పథకాలతో ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు మరికొంత మంది ఖాతాల్లోకి రూ.10వేలు జమ చేయబోతున్నారు. వరుసగా ఐదో ఏడాది కూడా మత్స్యకార భరోసా పథకం కింద జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఈ నగదు మొత్తాన్ని అందజేస్తున్నారు. సీఎం […]
Rajinikanth : దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 100వ జయంతి ఉత్సవాల్లో భాగంగా సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ప్రశంసలు కురిపించారు. అంతే కాకుండా ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధం గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో రజినీకాంత్ ఒక్క మాట కూడా వైకాపా గురించి మాట్లాడలేదు.. అయినా కూడా వైకాపా మాజీ మంత్రులు […]
Lakshmi Parvathi : తెలుగు ప్రజల అభిమాన హీరో ఎవరు అంటే దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు అనే చెప్పాలి.. ఈయనకు ఉన్న అభిమానులు తెలుగులో మరే ఇతర హీరోకు లేరు అంటే అతియసోక్తి కాదేమో.. మరి సీనియర్ ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీపార్వతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. ప్రస్తుతం ఈమె నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ వారు చేస్తున్న అక్రమాలను, అన్యాయాలను […]
Kodali Nani : తెలుగు ప్రజల అభిమాన హీరో ఎవరు అంటే సీనియర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి.. ఈయనకు ఉన్న అభిమానులు తెలుగులో మరే ఇతర హీరోకు లేరు అంటే అతియసోక్తి కాదేమో.. మరి అలాంటి హీరో శతజయంతి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా విచ్చేసిన విషయం తెలిసిందే.. ఈయన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసారు.. అంతేకాదు ఎన్టీఆర్ గురించి అలాగే నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబు […]
MP Avinash Reddy : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తనను మరియు తన సన్నిహితులను ఇరికించేందుకు కొందరు కక్షపూరితంగా వ్యవహరించడంతో పాటు సీబీఐ విచారణ తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. హత్య జరిగిన సమయంలో తాము వెళ్లక ముందు జరిగిన అంశాలను సీబీఐ వారు కానీ ఇతరులు ఎవ్వరు కానీ పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఆ విషయాలను ఇప్పుడు మీ మీదుకు తీసుకు వస్తున్నాను అంటూ ఒక వీడియోను అవినాష్ […]
YS Viveka : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు నేపథ్యంలో వైకాపా పై రాజకీయ ప్రభావం ఉండబోతున్నట్లుగా అన్నట్లుగా తెలుగు దేశం పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ కచ్చితంగా వైకాపా పై రాష్ట్రంలోనే కాదు కనీసం కడప జిల్లాలో కూడా రాజకీయ ప్రభావం ఉండదు అంటూ వైకాపా నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించడం ద్వారా రాజకీయ ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశ్యంతో తెలుగు దేశం పార్టీ […]
YS Sharmila : చనిపోయిన బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి పై తప్పుడు ప్రచారం వద్దని.. ఆయన గొప్ప వ్యక్తి.. చనిపోయిన వారి గురించి ఇప్పుడు తప్పుడు ప్రచారాలు చేసి ఆయన స్థాయిని తగ్గించివద్దని మీడియాకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు. వివేకా హత్య కేసు నేపథ్యంలో మీడియాలో రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. బాబాయి ఆస్తులన్నీ కూడా ఎప్పుడో సునీత పేరు మీద రాయించారని.. ఆయన పేరు పై ఎప్పుడు కూడా ఆస్తులు లేవని.. […]
MLC BTech Ravi : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సీబీఐ విచారణలో భాగంగా అవినాష్ రెడ్డిని పలు సార్లు విచారించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ బీటెక్ రవి మాట్లాడుతూ అన్న జగన్ సీఎం పదవిని.. తన ఎంపీ పదవిని అడ్డు పెట్టుకుని వివేకా హత్య కేసు నుండి అవినాశ్ రెడ్డి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ ఆరోపించాడు. వివేకాను హత్య చేసిన తర్వాత […]
Chandra Babu Naidu : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల ఒక మీడియా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పై పాజిటివ్ గా మాట్లాడటం పట్ల వైకాపా తీవ్రంగా స్పందించింది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో మరియు బీజేపీతో దోస్తీ కోసం ప్రాకులాడుతు ఉన్నాడని వైకాపా నాయకులు ఎద్దేవ చేశారు. పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ తో కలిసి ఎన్నికలకు వెళ్లడం వల్ల కనీసం […]
YS Sunitha Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సీబీఐ అధికారుల యొక్క విచారణ దూకుడు మీదుంది. వైకాపా నాయకులతో పాటు ఎంతో మందిని ఎంక్వౌరీ చేస్తూ ముందుకు దూసుకు పోతున్నారు. ఈ సమయంలో వివేకా హత్య కేసును సీబీఐ కి అప్పగించాలి అంటూ ముందు నుండి డిమాండ్ చేసి మధ్య మధ్య లో కోర్టుకు వెళ్తూ కేసును పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్న సునీత రెడ్డి పై రకరకాలుగా […]
Nara Chandrababu Naidu : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నిర్వహించిన రోడ్ షో ఫ్లాప్ అయ్యింది. జనం రాకపోవడంతో చంద్రబాబు నాయుడు కుట్ర పూరితంగా దళితులపై రాళ్లు వేయించాడు అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్ అయ్యారు. యర్రగొండపాలెం వైకాపా కంచుకోట అని.. దమ్ముంటే తెలుగుదేశం పార్టీ దీనిని గెలుచుకోవాలని మంత్రి సురేష్ సవాల్ విసిరారు. ఇలాంటి నీచ రాజకీయ పనులు చేయడం ద్వారా ఇక్కడ గెలవడం […]
Jagananne Maa Bhavishyathu : ‘జగనన్నే మన భవిష్యత్తు’ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 15 వేల సచివాలయాల్లో… ఏడు లక్షల మందితో ఈ సర్వే కోటి ఇళ్ల మైలు రాయి చేరుకోవటం హర్షనీయమని పేర్కొన్నారు ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం. 90 శాతం ప్రజానీకం జగనన్న పరిపాలన పట్ల సదాభిప్రాయంతో ఉన్నట్లు స్పష్టమైందని తమ్మినేని పేర్కొన్నారు. విశ్వసనీయతకు మారుపేరుగా మారి, సంక్షేమ యుగానికి నాంది పలికిన ప్రజా నాయకుడు సీఎం జగన్ అని తమ్మినేని అన్నారు. రానున్న […]
MP Avinash Reddy : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుండి ముందస్తు బెయిల్ తెచ్చుకున్న విషయం తెల్సిందే. అవినాష్ రెడ్డి తెచ్చుకున్న ముందస్తు బెయిల్ ను సవాల్ చేస్తు వివేకా కూతురు సునీత రెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెల్సిందే. సుప్రీం […]
Times Now Navbharat Survey : వచ్చే లోక్ సభ ఎన్నికల గురించి ఇప్పటి నుంచే సర్వేలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే రెండు సార్లు అధికారం దక్కించుకున్న బీజేపీ మరోసారి వస్తుందా లేదా అనేది అందరిలో ఉన్న సందేహం. అయితే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే విషయం మీద ఇప్పటికే అనేక సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. తాజాగా టైమ్స్ నౌ నవభారత్ సర్వే ఫలితాలు వచ్చాయి. ఇందులో మరోసారి బీజేపీదే […]
MP Avinash Reddy : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు లో ముందస్తు బెయిల్ ను తెచ్చుకున్న విషయం తెల్సిందే. ముందస్తు బెయిల్ ఉన్న కారణంగా అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం లేదు. అవినాష్ రెడ్డి తీసుకు వచ్చిన ముందస్తు బెయిల్ పై స్టే విధించాలంటూ వివేకా కూతురు సునీత రెడ్డి సుప్రీం కోర్టును నిన్న ఆశ్రయించిన విషయం […]
Sunitha Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. తనను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు నుండి అవినాష్ రెడ్డి ఉత్తర్వులు తీసుకు వచ్చాడు. అవినాష్ రెడ్డి ఈనెల 25వ తారీకు వరకు మధ్యంతర బెయిల్ ను తెచ్చుకున్న నేపథ్యంలో సీబీఐ అధికారులు విచారిస్తూ ఉన్నారు […]
Raghuveera Reddy : రాష్ట్రం విడిపోక ముందు తెలుగు రాజకీయాల్లో రఘువీరారెడ్డి చక్రం తిప్పారు. కాంగ్రెస్ పార్టీలో అధినాయకత్వానికి అత్యంత సన్నిహితుడిగా కొనసాగారు. పిసిసి అధ్యక్షుడిగా కొనసాగడంతో పాటు మంత్రిగా కూడా సుదీర్ఘ కాలం పాటు రఘువీరారెడ్డి విధులు నిర్వహించారు. ఈయన గత కొంత కాలంగా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. తన ఊరు, తన వ్యవసాయ క్షేత్రంలోనే కాలం గడుపుతూ వచ్చారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతూ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు. దాంతో […]
Ambati Rayudu : టీం ఇండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు త్వరలో క్రియాశీలక రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో అడుగు పెట్టడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లుగా కూడా ప్రకటించాడు. అంబటి రాయుడు తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేస్తాడు.. ఏ పార్టీ నుండి పోటీ చేస్తాడు అనే విషయమై గత కొన్ని రోజులుగా సస్పెన్స్ నెలకొంది. ఎట్టకేలకు ఆ సస్పెన్స్ కి అంబటి రాయుడు స్వయంగా […]
MP Avinash Reddy : మాజీ మంత్రి వివేక హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డిని ఏప్రిల్ 25వ తారీకు వరకు అరెస్టు చేయవద్దంటూ సిబిఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన పిటీషన్ విచారణ జరుగుతున్న విషయం తెల్సిందే. ఆ కారణంగా సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశాలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అవినాష్ రెడ్డి అరెస్టు […]
Sajjala Ramakrishna : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కుట్ర జరుగుతుంది అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో అనుమానం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై ఇదే తరహాలో కుట్ర జరిగిందని.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మరియు ఆయన కుటుంబాన్ని కేసులో ఇరికించేందుకుగాను కుట్ర జరుగుతోందని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. సిపిఐ అధికారులు విచారణ చేపట్టకుండా తమకు కావలసిన వారితో వాంగ్మూలం ఇప్పించుకొని కేసుని ముందుకు […]
YSRCP Party : ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా.. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో అధికార వైకాపా పరిస్థితి అంత బాగాలేదనే విషయం నిజం అంటూ రాజకీయ విశ్లేషకులు బలంగా వాదిస్తున్నారు. రాజధాని ని తరలించినందుకు గాను ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా అధికార పార్టీని వ్యతిరేకిస్తున్నారు. ఆ విషయం అధికార పార్టీ కూడా గుర్తించే ఉంటుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడాన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో […]