Gold And Silver : ఝ‌ల‌క్ ఇచ్చిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ప్ర‌స్తుత రేట్లు ఎలా ఉన్నాయంటే..!

NQ Staff - July 15, 2022 / 05:22 PM IST

Gold And Silver : ఝ‌ల‌క్ ఇచ్చిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ప్ర‌స్తుత రేట్లు ఎలా ఉన్నాయంటే..!

Gold And Silver : కొద్ది రోజులుగా కాస్త త‌గ్గుతూ వ‌చ్చిన బంగారం, వెండి ధ‌ర‌లు ఒకేసారి పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 200 పెరిగి.. రూ. 46,900కి చేరింది. గురువారం ఈ ధర రూ. 46,700గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 210 పెరిగి.. రూ. 51,160కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 50,950గా ఉంది.

దూసుకుపోతున్న బంగారం, వెండి

జూలై 15న హైదరాబాద్‌లోను బంగారం ధర జిగేల్ మంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 210 మేర పెరిగింది. దీంతో ఈ పుత్తడి రేటు రూ. 51,160కు చేరింది. ఇంకా 22 క్యారెట్ల బంగారం రేటు కూడా మెరిసింది. ఈ ఆర్నమెంటల్ గోల్డ్ రేటు రూ. 200 పెరిగింది. దీంతో ఈ పసిడి రేటు తులం రూ. 46,900కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు పైకి చేరడం ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

The Prices Gold And Silver

The Prices Gold And Silver

కోల్​కత్తా లో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,900 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 51,160గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,760గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,010గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 46,970గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 51,180గాను ఉంది.

దేశంలో వెండి ధరలు సైతం పెరిగాయి. ప్రస్తుతం.. కేజీ వెండి రూ. 600 పెరిగి.. రూ. 57,000గా ఉంది. గురువారం ఈ ధర రూ. 56,400గా ఉండేది. కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 62,300 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాల్​ 57,000.. బెంగళూరులో 62,300.. ముంబైలో 57,000.. చెన్నైలో 62,300గా ఉన్నాయి.

Read Today's Latest Business in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us