Gold Rate : స్థిరంగా బంగారం ధరలు.. ప్రస్తుతం ధర ఎంత ఉంది అంటే..!
NQ Staff - August 12, 2022 / 02:46 PM IST

Gold Rate : కొద్ది రోజులుగా బంగారం ధరలలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలో ఈ రోజు ఎలాంటి మార్పు లేదు. బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. పుత్తడి బాటలోనే వెండి కూడా పయనించింది. సిల్వర్ రేటు కూడా స్థిరంగానే కొనసాగుతోంది. నిన్న పడిపోయిన పసిడి రేటు ఈరోజు స్థిరంగా కొనసాగడం గమనార్హం.
స్థిరంగా బంగారం ధర..
హైదరాబాద్‌లో ఆగస్ట్ 12న 24 క్యారెట్లు, 22 క్యారెట్లు బంగారం ధరలు వరుసగా రూ. 51,650గా, రూ. 47,350గా ఉన్నాయి. బంగారం ధర నిన్న రూ. 650కి పైగా పడిపోయిన విషయం తెలిసిందే. వెండి ధర విషయానికి వస్తే.. సిల్వర్ రేటు కేజీకి రూ. 64,200 వద్ద కొనసాగుతోంది. వెండి ధర నిన్న రూ. 300 దిగి వచ్చింది.

Rate Gold Fell Yesterday Remained Stable Today
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,650, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,290 ఉంది..
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,650, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 గా ఉంది.
ఇక వెండి విషయానికి వస్తే.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.58,900గా కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ.58,900
చెన్నైలోలో కిలో వెండి ధర రూ.64,200గా ఉంది. బెంగళూరులో రూ.64,200, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,200గా ఉంది.