Oppo Reno 8 : ఒప్పో నుండి స‌రికొత్త ఫీచ‌ర్ ఫోన్స్.. స్పెసిఫికేష‌న్స్ ఏంటంటే..!

NQ Staff - July 19, 2022 / 05:07 PM IST

Oppo Reno 8 : ఒప్పో నుండి స‌రికొత్త ఫీచ‌ర్ ఫోన్స్.. స్పెసిఫికేష‌న్స్ ఏంటంటే..!

Oppo Reno 8 : ఒప్పో ఎప్ప‌టిక‌ప్పుడు ఆక‌ర్షణీయ‌మైన ఫోన్స్‌ని మార్కెట్‌లోకి తీసుకొస్తున్న విష‌యం తెలిసిందే. సోమ‌వారం ఒప్పో రెనో 8, ఒప్పో రెనో 8 ప్రో మొబైళ్లు భారత్‌లో విడుదలయ్యాయి. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెెమెరా, ఫుల్ హెచ్‌డీ+ AMOLED డిస్‌ప్లేలను రెండు ఫోన్‌లు కలిగి ఉన్నాయి. ప్రో మోడల్ డైమన్సిటీ 8100ను కలిగి ఉండగా.. రెనో 8లో డైమన్సిటీ 1300 ప్రాసెసర్‌ ఉంది. రెనో 8 ప్రో మొబైల్‌ మారిసిలికాన్ ఎక్స్ ఎన్‌పీయూ టెక్నాలజీ కెమెరాతో వస్తోంది.

మంచి ఫీచ‌ర్స్‌తో..

Oppo Reno 8 and Oppo Reno 8 Pro have Been Launched India

Oppo Reno 8 and Oppo Reno 8 Pro have Been Launched India

ఒప్పో రెనో 8 ప్రోలో 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ AMOLED డిస్‌ప్లే వస్తోంది. 120 Hz రిఫ్రెష్ రేట్ HDR10+ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. ఈ మొబైల్‌లో మీడియాటెక్ డైమన్సిటీ 8100 ప్రాసెసర్‌ ఉంటుంది. 12జీబీ LPDDR5 ర్యామ్, 256జీబీ స్టోరేజ్ టాప్‌ వేరియంట్‌గా ఉంది.

ఇందేలో మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ Sony IMX766 ప్రధాన కెమెరా, 112 ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉండే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. మెరుగైన పర్ఫార్మెన్స్ కోసం మాలిసిలికాన్ ఎక్స్ ఎన్‌పీయూ టెక్నాలజీతో ఈ కెమెరాలను ఒప్పో పొందుపరిచింది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరాతో రెనో 8 ప్రో వస్తోంది.

ఒప్పో రెనో 8 ప్రో మొబైల్‌లో 4,5000mAh బ్యాటరీ ఉంది. 80వాట్ల సూపర్ ఫ్లాష్ చార్జ్ టెక్నాలజీతో కూడిన ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. డ్యుయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 6, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ ఉన్న 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ AMOLED డిస్‌ప్లేను ఒప్పో రెనో 8 మొబైల్‌ కలిగి ఉంది.

Oppo Reno 8 and Oppo Reno 8 Pro have Been Launched India

Oppo Reno 8 and Oppo Reno 8 Pro have Been Launched India

8జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్ ఉంటుంది. ఈ మొబైల్‌ వెనుక కూడా మూడు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెెమెరాలు ఉన్నాయి. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రెనో 8ను ఒప్పో తీసుకొచ్చింది. ఒప్పో రెనో 8 ప్రో 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.45,999గా ఉంది. గ్లేజ్డ్ బ్లాక్, గ్లేజ్డ్ గ్రీన్ కలర్స్‌లో అందుబాటులోకి వస్తుంది.

8జీబీ ర్యామ్ + 128జీబీ ఉన్న ఒప్పో రెనో 8 ఫోన్‌ ప్రారంభ ధర రూ.29,999గా ఉంది. బ్లాక్, గోల్డ్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఒప్పో రెనో ప్రో 19 మొబైల్‌ సేల్ నేడు (జూలై 19)న మొదలుకానుండగా.. ఒప్పో రెనో 8 ఫోన్‌ ఈనెల 25న సేల్‌కు రానుంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ మొబైళ్లను కొనుగోలు చేయవచ్చు.

Read Today's Latest Technology in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us