Motorola : మోటోరోలా నుండి 5 జీ స్మార్ట్ ఫోన్ లాంచ్.. ప్రత్యేకతలు ఇవే…!
NQ Staff - August 12, 2022 / 06:13 PM IST
Motorola : మోటోరోలా సరికొత్త ఫీచర్స్‌తో అనేక రకాల ఫోన్స్ లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మోటోరోలా జీ సిరీస్‌లో మరో 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. మోటో జీ62 5జీ మొబైల్‌ను భారత్‌లో గురువారం లాంచ్ చేసింది మోటోరోలా. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో వస్తోంది.
స్పెషల్ ఫీచర్స్‌తో..
మోటో జీ62 5జీ మొబైల్ రెండు వేరియంట్లలో వస్తోంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఉండే టాప్ వేరియంట్ ధరను రూ.19,999గా మోటోరోలా నిర్ణయించింది. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్ సేల్‌కు వస్తుంది. ఫ్రోస్టెడ్ బ్లూ, మిడ్‌నైట్ గ్రే కలర్ ఆప్షన్స్‌లో ఈ మొబైల్ అందుబాటులోకి వస్తుంది.
తొలి సేల్ సందర్భంగా ప్రత్యేకమైన లాంచ్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో మోటో జీ62 5జీ మొబైల్‌ను కొంటే రూ.1,500 తక్షణ డిస్కౌంట్ దక్కుతుంది. అంటే బేస్ మోడల్‌ను రూ.16,499కే దక్కించుకోవచ్చు. 6.5 ఇంచుల FHD+ LCD డిస్‌ప్లేతో మోటో జీ62 5జీ స్మార్ట్‌ఫోన్ వస్తోంది. 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 405ppi పిక్సెల్ డెన్సిటీ ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ మొబైల్ రన్ అవుతుంది. గరిష్ఠంగా 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను పొడిగించుకోవచ్చు. 12 5జీ బ్యాండ్‌లకు ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది.
మోటో జీ62 5జీ మొబైల్ వెనుక మూడు కెమెరాలు ఉంటాయి. 50 MP ప్రధాన కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ షూటర్, 2 MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 MP ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ వస్తోంది. ఫ్రంట్ కెమెరాకు క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీని ఇచ్చినట్టు మోటోరోలా పేర్కొంది.
డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్లను ఈ ఫోన్ కలిగి ఉంది. రెండు మైక్రోఫోన్స్ ఉంటాయి. థింక్ షీల్డ్ మొబైల్ సెక్యూరిటీ ఫీచర్‌ను కూడా ఈ మొబైల్‌లో ఇస్తున్నట్టు మోటోరోలా పేర్కొంది.