Gold And Silver Prices : పెరిగిన పసిడి, వెండి ధరలు.. నేడు రేట్లు ఎలా ఉన్నాయంటే..!
NQ Staff - July 21, 2022 / 01:07 PM IST

Gold And Silver Prices : గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఇప్పుడు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో (20-07-2022 బుధవారం) పోలిస్తే ఈ రోజు బంగారరం ధర రూ.100 పెరిగింది. ఈరోజు (21-07-2022 సోమవారం) మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 46,400 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,300గా ఉంది.
స్వల్పంగా పెరుగుదల..
గ్లోబల్ మార్కెట్‌లో పసిడి రేటు పడిపోయింది. 0.46 శాతం క్షీణించింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1692 డాలర్లకు దిగి వచ్చింది. బంగారం రేటుకు 1700 డాలర్ల వద్ద మద్దతు లభిస్తోంది. అయితే పసిడి రేటు ఈ స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. దీంతో బంగారం ధరలు మరింత తగ్గొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే వెండి రేటు విషయానికి వస్తే.. సిల్వర్ రేటు ఔన్స్‌కు 0.44 శాతం పడిపోయింది. 18.58 డాలర్ల వద్ద కదలాడుతోంది.

July 21 Gold And Silver Prices Increased Marginally
ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,670గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,920గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620గా ఉంది.
ఇక కోల్‌కత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620గా ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,620గా ఉంది.

July 21 Gold And Silver Prices Increased Marginally
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620గా ఉంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు రూ.1000 పెరిగాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.61,700 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.61,700గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 56,000గా ఉంది.