Gold and Silver Rates : నేటి గోల్డ్ లెక్క‌లేంటి.. బంగారం ధ‌ర పెరిగిందా, త‌గ్గిందా?

NQ Staff - August 25, 2022 / 09:29 AM IST

Gold and Silver Rates : నేటి గోల్డ్ లెక్క‌లేంటి.. బంగారం ధ‌ర పెరిగిందా, త‌గ్గిందా?

Gold and Silver Rates : గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌ల‌లో ప‌లు మార్పులు చోటు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి. బుధవారం ధరలు భారీగా తగ్గగా.. ఇవాళ కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 320 తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 250 దిగివచ్చింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 51,550 గా నమోదైంది.

Hyderabad Gold and Silver Rates on 25th August 2022

Hyderabad Gold and Silver Rates on 25th August 2022

క్ర‌మ‌క్ర‌మంగా..

22 క్యారెట్ల బంగారం రేటు రూ. 47,250 వద్ద కొనసాగుతోంది. ఇక ఇవాళ కిలో వెండిపై రూ. 100 పెరగగా … హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.60,900గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.47,250గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 51,150గా నమోదైంది. ఇక్కడ వెండి ధర కిలో రూ. 60,900 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,550గా ఉంది.

దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.48,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,420గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,420గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,400గా ఉంటే… 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,7100 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,300గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 వద్ద ఉంది. ఇక కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 51,550గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,250 వద్ద కొనసాగుతోంది.

Read Today's Latest Business in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us