Gold and Silver Rates : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..!
NQ Staff - August 23, 2022 / 09:00 AM IST
Gold and Silver Rates : గత కొద్ది రోజులుగా బంగారం ధరలు శాంతంగానే ఉన్నాయి. తగ్గడం లేదంటే స్థిరంగా ఉంటున్నాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన పసిడి రేటు నేడు మాత్రం నేల చూపులు చూసింది. ఆగస్ట్ 23న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గింది. రూ. 51,930కు క్షీణించింది. పది గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 దిగి వచ్చింది. దీంతో ఈ పసిడి రేటు 10 గ్రాములకు రూ. 47,600కు తగ్గింది.
తగ్గుదల..
ఢిల్లీలో 22క్యారెట్ల పసిడి ధర రూ. 47,750గాను, 24 క్యారెట్ల బంగారం ధర 52,100గాను ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,600 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 51,930గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,150గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,530గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 47,630గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 51,960గాను ఉంది.
హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,600గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,930గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. దేశంలో వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి రూ. 40 తగ్గి.. 5,520గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 400 దిగొచ్చి.. రూ. 55,200కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 55,600గా ఉండేది.