Gold and Silver Rates : పెరగని బంగారం ధర.. వెండి పరిస్థితి ఏంటి?
NQ Staff - August 22, 2022 / 09:00 AM IST

Gold and Silver Rates : బంగారం కొనే వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. .. బంగారం వెండి ధరలు ఐదు రోజుల కాలంలో చూస్తే దిగి వచ్చాయి. బంగారం ధర రూ. 380 మేర తగ్గింది. ఇక వెండి రేటు అయితే ఏకంగా రూ. 3,500 పతనమైంది. ఇది పసిడి ప్రియులకు ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ఇక బంగారం కొనాలనుకున్నవారు అస్సలు ఆలస్యం చేయకుండా బంగారం కొనుగోలు చేయవచ్చు.

Hyderabad Gold and Silver Rates on 22nd August 2022
షాకిచ్చిన వెండి
ఆగస్ట్ 22న హైదరాబాద్‌లో బంగారం ధరలు నిలకడగానే ఉన్నాయి. పసిడి రేటు స్థిరంగానే కొనసాగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేటు పది గ్రాములకు రూ. 47,800 వద్ద కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్ల బంగార ధర కూడా ఇదే దారిలో నడిచింది. 52,150 వద్ద ఉంది. అంటే నేడు పసిడి రేట్లలో ఎలాంటి మార్పు లేదని చెప్పుకోవచ్చు.
విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నం : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..52,150 వద్ద ఉంది. బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 పలుకుతోంది.
చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,220గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,600 పలుకుతోంది.ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 వద్ద కొనసాగుతోంది.ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల రూ.52,310 పలుకుతోంది.
కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.52,150కు లభిస్తోంది. కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 వద్ద ఉంది.అయితే నేడు సిల్వర్ కొనాలనుకునేవారికి షాక్ తగిలింది. స్వల్పంగా వెండి ధరలు పెరిగాయి. ఈరోజు ఉదయం బులియన్ మార్కెట్లో కిలో రూ.100 పెరగడంతో హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.61,300గా ఉంది. విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లోనూ ఇదే ధరకు వెండి లభిస్తోంది. ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో రూ. 55,600 పలుకుతోంది.