Samsung Galaxy M53 5G Smartphones : ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ.5000ల డిస్కౌంట్‌.. అది ఎలానో తెలుసా?

NQ Staff - August 5, 2022 / 01:50 PM IST

Samsung Galaxy M53 5G Smartphones : ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ.5000ల డిస్కౌంట్‌.. అది ఎలానో తెలుసా?

Samsung Galaxy M53 5G Smartphones : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఇంకొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. దీంతో అమెజాన్‌లో బంప‌ర్ ఆఫ‌ర్స్ మ‌న‌కు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్ట్ 5 అర్ధరాత్రి 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సేల్ ఆగస్ట్ 10 వరకు జరగనుంది. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్, అమెజాన్ కూపన్ ఆఫర్స్‌తో పాటు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లాంటి ఆఫర్స్ ఉన్నాయి.

బంపర్ ఆఫ‌ర్..

శామ్ సంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో రిలీజ్ చేసిన సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ ధరతో పోలిస్తే ఏకంగా రూ.5,000 డిస్కౌంట్‌తో లభించనుంది. బ్యాంక్ ఆఫర్‌తో కలిపి మొత్తం రూ.5,000 డిస్కౌంట్ పొందొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.25,000 లోపే సొంతం చేసుకోవచ్చు.

Huge Discount on Samsung Galaxy M53 5G Smartphones

Huge Discount on Samsung Galaxy M53 5G Smartphones

సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,499 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,499. ప్రస్తుతం 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.24,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.26,999 ధరకు లిస్ట్ అయ్యాయి.

ఆఫర్స్‌తో బేస్ వేరియంట్‌ను రూ.21,499 ధరకే సొంతం చేసుకోవచ్చు. అంటే రిలీజ్ ధరతో పోలిస్తే రూ.5,000 తక్కువకే సాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్ లభిస్తోంది. ఎక్స్‌ఛేంజ్ ద్వారా కొనాలనుకునేవారికి రూ.20,000 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఇస్తోంది అమెజాన్.

Read Today's Latest Business in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us