Hotel Business : ఊపందుకున్న హోటల్ బిజినెస్.. ఊపిరి పీల్చుకుంటున్న యజమానులు
NQ Staff - July 13, 2022 / 11:03 AM IST

Hotel Business : కరోనా మహమ్మారి ప్రజలను ఎంత భయబ్రాంతులకి గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వలన చాలా బిజినెస్‌లకి కోలుకోలేని దెబ్బ పడింది. ముఖ్యంగా హోటల్ పరిశ్రమ అయితే చిన్నాభిన్నం అయింది. అయితే ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

Hotel Business Progressing Due Business and Foreign Tourists
కాస్త బెటర్..
కరోనా ముందు నాటి స్థాయి ఆదాయం, మార్జిన్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. కరోనా వైరస్ కేసులు భవిష్యత్తులో పెరిగినా డిమాండ్ బలంగానే ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వ్యాపార ప్రయాణాలు, విదేశీ పర్యాటకుల రాకలో క్రమంగా పురోగతి కనిపిస్తున్నట్టు తాజాగా విడుదల చేసిన నివేదికలో ఇక్రా వివరించింది.
దేశవ్యాప్తంగా ప్రీమియం హోటళ్లలో గదుల భర్తీ రేటు 2022–23లో 68–70 శాతం మేర ఉండొచ్చని వెల్లడించింది. ఇక సగటు రూమ్ రేటు రూ.5,600–5,800 స్థాయిలో ఉంటుందని తెలిపింది. ‘‘2022–23 సంవత్సరం ఆరంభం హోటల్ పరిశ్రమకు సానుకూలంగా ఉంది. ప్రీమియం హోటళ్లలో భర్తీ రేటు 56–58 శాతం మేర మొదటి మూడు నెలల్లో (జూన్ క్వార్టర్)లో నమోదైంది.

Hotel Business Progressing Due Business and Foreign Tourists
2021–22 ఆర్థిక సంవత్సరంలో ఉన్న 40–42 శాతం కంటే ఇది ఎక్కువ. కరోనాకు ముందు 20219–20 మొదటి మూడు నెలల్లో ఉన్న 60–62 శాతం సమీపానికి చేరుకుంది. 2022–23 మొదటి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా సగటు రూమ్ రేటు 4,600–4,800గా నమోదైంది. 2021–22లో ఇది రూ.4,200–4,400గా ఉంది.
కరోనా ముందు నాటితో పోలిస్తే ఇంకా 16–18 శాతం తక్కువలో ఉంది’’అని ఇక్రా హోటల్ సెక్టార్ హెడ్ వినుతా తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లు ఆటోమేటిక్‌గా సర్వీస్ ఛార్జీలు విధించకుండా లేదా ఆహార బిల్లులలో డిఫాల్ట్‌గా సర్వీస్ ఛార్జీ యాడ్ చేయకుండా CCPA కొత్త మార్గదర్శకాలు రూపొందించిన సంగతి తెలిసిందే. మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే వినియోగదారులు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో కూడా స్పష్టంగా పేర్కొంది.