Gold Price : మళ్లీ పెరిగిన పసిడి ధర.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..!
NQ Staff - July 6, 2022 / 12:18 PM IST

Gold Price : బంగారం ధరలలో హెచ్చుతగ్గులు వస్తూనే ఉన్నాయి. ఒక్కసారిగా బంగారం ధర తగ్గిపోవడం, వెంటనే మళ్లీ పెరగడం వంటివి మనం చూస్తూ వస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి. మంగళవారం పసిడి ధర పెరగగా… ఇవాళ కూడా మరోసారి ధర ఎగబాకింది.
పైపైకి ధరలు..
ఫలితంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 130 పెరగగా… 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 100 ఎగబాకింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,470గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 48,100 వద్ద కొనసాగుతోంది. ఇవాళ కిలో వెండిపై రూ. 1100 తగ్గగా… హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.64,700గా ఉంది.
కాగా బంగారం ధర గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయనించింది. సిల్వర్ ధర రూ. 700 మేర పరుగులు పెట్టింది. దీంతో వెండి రేటు కేజీకి రూ. 64,700కు చేరింది. వెండి ధర రెండు రోజుల్లోనే రూ. 1200 మేర పెరిగింది.

Gold Price Increased Again
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.48,100గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 52,470గా నమోదైంది. ఇక్కడ వెండి ధర కిలో రూ. 64,700 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470గా ఉంది.
దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.48,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,420గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470గా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,100గా ఉంటే… 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,470 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,130గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,500 వద్ద ఉంది. ఇక కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 52,3470గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,100 వద్ద కొనసాగుతోంది.