Business Ideas: పచ్చళ్ల తయారీ.. భలే మంచి బిజినెస్..నెలకు రూ.30వేలు ఆదాయం
NQ Staff - June 13, 2022 / 08:36 PM IST

Business Ideas: మీకు ఆదాయం సరిపోవట్లేదా?.. కుటుంబం నెట్టుకురావడం కష్టంగా ఉందా?.. ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారా?.. వ్యాపారం చేసే ఆలోచన ఉందా?.. అయితే మీ కోసం ఓ బిజినెస్ ఐడియా. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని పొందాలనుకునే వాళ్లు ఈ ఐడియాని ఫాలో అవ్వొచ్చు. పైగా ఈ వ్యాపారం చేయడానికి మీరు ఎక్కడికీ వెళ్లక్కర్లేదు. కేవలం ఇంట్లో కూర్చుని ఈ వ్యాపారాన్ని చేయవచ్చు. తక్కువ పెట్టుబడి పెట్టి నెలకి రూ.30వేల వరకు సంపాదించవచ్చు.
చాలా మందికి రోజూ పచ్చడి లేనిదే ముద్ద దిగదు. అందుకనే దీనిని మీరు క్యాష్ చేసుకోవచ్చు. రుచికరమైన పచ్చళ్లు క్వాలిటీగా తయారు చేయగలిగితే చాలు మంచి మార్కెట్ ఉంటుంది. మంచి రాబడి కూడా పొందవచ్చు. అయితే దీని కోసం పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం పదివేల రూపాయలతో పచ్చళ్ల బిజినెస్ మొదలుపెట్టవచ్చు. రాబడి మాత్రం నెలకు 25 వేల నుంచి 30 వేల వరకు పొందొచ్చు.
వ్యాపారం మొదలుపెట్టడానికి కూడా పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. ఆత్మనిర్బర్ భారత్ మిషన్ సహాయం చేస్తుంది. అయితే బిజినెస్ ప్రారంభించాలంటే 900 స్క్వేర్ ఫీట్ స్థలం ఉండాలి. అలాగే కొంచెం ఓపెన్ స్పేస్ ఉండాలి. పచ్చళ్లు తయారు చేయడానికి, ఎండబెట్టడానికి , ప్యాకింగ్ చేయడానికి అవసరం పడుతుంది. ఎక్కువ కాలం పచ్చళ్లు పాడైపోకుండా ఉంచాలంటే చాలా శుభ్రత పాటించాలి.
వ్యాపారం చేయాలంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి లైసెన్స్ తీసుకోవాలి. పచ్చళ్లను చుట్టుపక్కల ఉండే షాపులకు సరఫరా చేసి బిజినెస్ ను పెంచుకోవచ్చు. అలాగే ఆన్ లైన్ లో సేల్ చేయొచ్చు. ఇలా వ్యాపారాన్ని విస్తరించుకుని మంచి లాభం పొందవచ్చు.