Adani : మీడియాపై క‌న్నేసిన అదానీ.. వారి గుప్పిట్లోకి వెళ్లిన ఎన్‌డీటీవీ

NQ Staff - August 24, 2022 / 08:57 AM IST

Adani : మీడియాపై క‌న్నేసిన అదానీ.. వారి గుప్పిట్లోకి వెళ్లిన ఎన్‌డీటీవీ

Adani : అదానీ చిటికిస్తే ఏదైన క్ష‌ణాల‌లో వారి ముందు ప్ర‌త్యక్షం అవుతుంది. వారు ఎయిర్ పోర్టులు.. పోర్టులను వదిలి పెట్టడం లేదు. అదానీ గ్రూప్ గత మార్చిలో స్థానిక డిజిటల్ బిజినెస్ న్యూప్ ప్లాట్ ఫామ్ క్వింటిల్లియన్ లోనూ మైనారిటీ వాటా చేజిక్కించుకుంది. భారతీయ సంప‌న్న వ్యాపారి గౌత‌మ్ ఆదానీ ప్ర‌ధాన మీడియా రంగంలోనూ అడుగుపెట్టే దిశ‌గా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. తాజాగా ప్ర‌ముఖ జాతీయ వార్తాచానెల్ నెట్‌వ‌ర్క్ `ఎన్‌డీటీవీ`ని కైవ‌సం చేసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

Adani who was seen on the media

Adani who was seen on the media

మీడియాపై క‌న్ను..

దేశంలోనే ప్ర‌ముఖ వార్తా చానెల్ ఎన్డీటీవీని అదాని టేకోవ‌ర్ చేయ‌బోతున్నారా.. అంటే అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తుంది. ప‌రోక్షంగా 29.18 శాతం వాటా కొనుగోలు చేశారు. ఇక ఓపెన్ ఆఫ‌ర్ ద్వారా మ‌రో 26 శాతం వాటా కొనుగోలు చేయ‌నున్నార‌ని వార్త‌లొచ్చాయి. అదానీ గ్రూప్ .. అదానీ ఎంట‌ర్‌ప్రైజెస్ అనుబంధ ఏఎంఎన్ఎల్ ఈ వాటా కొనుగోలు చేసిన‌ట్లు తెలిపింది.

ఎన్డీటీవీలో 26 శాతం వాటా కొనుగోలుకు అదానీ గ్రూప్ తాజాగా ప్రతిపాదన చేసింది. 1,67,62,530 షేర్లను ఒక్కొక్కటి రూ.294 ముఖ విలువతో మొత్తం రూ.492 కోట్లకు కొనుగోలు చేసేందుకు విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఎంజీ మీడియా నెట్ వర్క్స్ లిమిటెడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ఈమేరకు ఎన్డీటీవీకి ఓపెన్ ఆఫర్ ఇచ్చాయి.

ఆ ఆఫ‌ర్ స‌క్సెస్ అయితే, ఎన్‌డీటీవీలో మెజారిటీ షేర్ ఆదానీ సొంత‌మ‌వుతుంది. అయితే, ఆ రూ. 250 కోట్ల రుణాన్ని ఈక్విటీ గా మార్చుకునేందుకు ఎన్‌డీటీవీ షేర్ హోల్డ‌ర్ల అనుమ‌తి లేద‌ని ఎన్‌డీటీవీ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. 2008 -09లో ఎన్‌డీటీవీకి రూ. 250 కోట్లు అప్పుగా ఇచ్చిన సంస్థ మొద‌ట్లో రిల‌య‌న్స్ గ్రూప్‌లో భాగంగా ఉండ‌డం విశేషం.

Read Today's Latest National in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us