Connect with us

Entertainment

బిగ్ బాస్ : సుజాత ఎలిమినేషన్ కు ‘బిట్టు’ కారణం కాదట, అసలు కారణం ఇదే..!

Published

on

Share the News from here

బిగ్ బాస్ ఫోర్, ఈ సీజన్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే పోయిన వారం జోర్దార్ సుజాత ఎలిమినేట్ అయిన విషయం కూడా తెలిసిందే. అయితే సుజాత ఎలిమినేట్ అవ్వడానికి కారణం హోస్ట్ నాగార్జున ను బిట్టు అని పిలవడం వలనే అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇలా వస్తున్న వార్తలకు స్పందించిన సుజాత క్లారిటీ ఇచ్చింది. అయితే అయితే బిగ్ బాస్ టీం వారే నాగార్జునను బిట్టు అని పిలువమన్నారని సుజాత చెప్పుకొచ్చింది.

ఒకవేళ అలా పిలవడం ఇష్టం లేకపోతే కన్ఫెషన్ రూమ్ కు పిలిచి పిలువకూడదు అని చెప్పే వారు కదా అని ఆమె పేర్కొంది. నాగార్జున, బిగ్ బాస్ టీం కోరిక మేరకే నేను బిట్టు అని పిలిచానని, ఏదో నా అంతటా నేను పిలవలేదని క్లారిటీ ఇచ్చింది సుజాత. ఒకవైపు నాగార్జున ను బిట్టు అని పిలవడం, ఫేక్ నవ్వు, టాస్కుల్లో సరిగా పాల్గొనకపోవడం వలనే సుజాత ను బయటకు పంపించాం అని బిగ్ బాస్ ప్రేక్షకులు చెపుతున్నారు.

Do NOT follow this link or you will be banned from the site!