Connect with us

Entertainment

బిగ్ బాస్ గురించి నిజాలు మాట్లాడిన దేవి నాగవల్లి

Published

on

Share the News from here

‘దేవి నాగవల్లి’ ఓ న్యూస్ యాంకర్ గా సుపరిచితురాలు. ఆమె ఏది చేసిన విభిన్నంగా చేస్తుంది. ఇక ఆమె హెయిర్ స్టైల్ కూడా వెరైటీగా ఉంటుంది. అయితే ముక్కు సూటిగా మాట్లాడే దేవి.. ఈ మధ్య బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎలిమినేట్ అయినా విషయం తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్ వ్యూ లో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి ఎందుకు ఎలిమినేట్ అయ్యానో ఇంతవరకు తెలియట్లేదు అని తెలిపింది. సడెన్ గా ఎలిమినేట్ అని చెప్పగానే నాకు మాటలు రాలేదని, ఒక్కసారిగా బ్లాంక్ పేస్ అయ్యిందని పేర్కొంది దేవి.

అలాగే ఆ స్టేజి మీదా సాంగ్ ఎలా పాడానో కూడా తెలియదని చెప్పింది. ఇక ఎలిమినేట్ విషయంలో మాత్రం నాకు ఇప్పటికి కన్ ఫ్యూషన్ అని అసలు నేను ఎందుకు ఎలిమినేట్ అయ్యానో నాకు తెలీదు అని చెప్పుకొచ్చింది. నేను బయటకు వచ్చాక అనేక మంది మెసేజీ లు చేస్తున్నారని..మీకు ఓట్లు వేసాము మేడం. మీకన్నా వెనకాల ఉన్న వారు ఎలిమినేట్ అవ్వకుండా మీరు ఎలా ఎలిమినేట్ అయ్యారని మెసేజీలు చేస్తున్నారని పేర్కొంది. ఇక హౌస్ లో నేను ఏంతో బాగా ఆడానని, కానీ మొత్తానికి బయటకు వచ్చేసా ఇప్పుడు ఏం చేయలేమని.. డైలమా లోకి వెళ్లానని చెప్పింది దేవి.

మీరు బయటకు రావడానికి పవన్ కళ్యాణ్ ఫాన్స్ కూడా కారణమని మీరు భావిస్తున్నారా అని అడగగా.. ఇక దేవి మాట్లాడుతూ.. వాళ్ళు అలా చేస్తే మరి నాకు వచ్చిన వేసిన ఓట్లు ఎక్కడనుండి వచ్చినట్లు, ఆలా ఏం కాదు. వాళ్ళ వల్లే కూడా నాకు ప్లస్ పాయింట్ అయ్యిందని చెప్పింది. కావున అలాంటిది ఏం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇక మెగా ఫ్యామిలీతో మీకు ఎలాంటి బాండింగ్ ఉంటుంది అడగగా..కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు అందరు కూడా బాగా మాట్లాడుతారని మంచి బాండింగ్ ఉంటుందని నాకు ఫ్యామిలీగా అనిపిస్తుందని తెలిపింది.

కరాటే కళ్యాణి బిగ్ బాంబ్ వేయడానికి కారణం ఏం లేదని, కళ్యాణి నేను హౌస్ లో క్లోస్ గా ఉండేవాళ్లమని తెలిపింది. అమ్మ రాజశేఖర్ పలు టాస్క్ ల సమయంలో నాకు డైలాగులు రాసిచ్చారని తెలిపింది. దేవి నాగవల్లి మరు స్క్రిప్టేర్ హా అని అడగగా.. నేను అసలు స్క్రిప్టేర్ కాదని, నాకు హౌస్ లో ఫ్రీడమ్ ఇచ్చారని తెలిపింది. బిగ్ బాస్ కి గంగవ్వ ఫిట్ అని అనుకుంటున్నారా అని అడగగా.. గంగవ్వ బిగ్ బాస్ కు ఫిట్ కాదని తెలిపింది. సింపతి చూపిస్తున్నారని తెలిపింది. టాస్కులు ఆమెకు పెట్టలేదు అని చెప్పింది. ఒక గేమ్ వైస్ ఆమె ఫిట్ కాదని తెలిపింది.

హోస్ లో ఉన్న కంటెస్టెంట్లు అందరు నాకు కొత్తే నాని తెలిపింది. నాకు ఇంతకుముందు పరిచయం లేదని తెలిపింది. హరియాణా ను ఎందుకు సేవ్ చేసారు అని అడగగా.. తాను నిజాయతీగా ఆడుతుందని, ఆమె నాకు బాండింగ్ అయ్యిందని తెలిపింది. అలాగే హౌస్ లో అందరికి నా మీద నమ్మకం కలిగింది అని చెప్పింది. నా ఎలిమినేషన్ తరువాత చాలామంది యాంకర్ లు షాక్ అయ్యారని తెలిపింది. అసలు ఎవరు ఊహించలేదని చాలామంది సెలెబ్రిటీలు స్పందించారని చెప్పింది.

దాసరి నారాయణరావు మీకు బంధువు అవుతారని తెలిసింది అని అడగగా.. అవును దాసరి నారాయణ గారు నాకు తాత అవుతారని, నాకు నేను ఎవరిని సపోర్ట్ గా తీసుకోలేదని చెప్పింది. నా జర్నలిస్ట్ జాబ్ లో హాయిగా చేసుకుంటున్నాని అందుకే దాసరి గారు మా బంధువు అనే విషయాన్నీ బయట పెట్టలేదని చెప్పింది. అలాగే దాసరి గారు చనిపయినపుడు తన ఇంటి గేట్ ముందు రిపోర్టింగ్ చేసానని తెలిపింది. మా అమ్మ నాన్న పెళ్లికి కూడా దాసరిగారు, శోభన్ బాబూ ఇతర సెలబ్రెటీలు వచ్చారని చెప్పింది.

ఇక బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఐదుగురు ఉంటారని అడగగా.. జనాలు డిసైడ్ చేస్తారని తెలిపింది. ఇక నా అభిప్రాయం ప్రకారం అభిజిత్, అమ్మరాజశేఖర్, నోయెల్, అఖిల్, అలాగే గంగవ్వను కూడా ఉండొచ్చని పేర్కొంది.

Do NOT follow this link or you will be banned from the site!