Connect with us

Entertainment

అభిజిత్ బిస్కెట్ అయ్యాడా..?

Published

on

Share the News from here

హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ అప్ డేట్స్…
బిగ్ బాస్ హౌస్ లో అభిజిత్ కి రోజు రోజుకీ బయట క్రేజ్ పెరిగిపోతోంది.. ఓటంగ్ పర్సెంటేజ్ లో టాప్ లో ఉంటూ అందరికీ షాక్ ఇస్తున్నాడు ఈ యంగ్ హీరో. అయితే, రీసంట్ గా చేసిన బిబి హోటల్ టాస్క్ లో అభిజిత్ బిస్కెట్ అయ్యాడా… లేని పోని ట్రిక్స్ ప్లే చేసి జోకర్ అయ్యాడా అంటే చాలా మంది అవుననే కామెంట్స్ చేస్తున్నారు. తనలో ఉన్న జెన్యూనిటీ గేమ్ ని మిస్ అయ్యాడని చెప్తున్నారు చాలా మంది. అయితే అభిజిత్ ఫ్యాన్స మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు.. ఇదో గేమ్ ప్లాన్ అని మీకు అర్ధం కాకపోతే వదిలేయమని అంటున్నారు. ఇప్పుడు రెండు టీమ్స్ గా సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.. అబిజిత్ ఫ్యాన్స్ గ్రూప్ లు రెచ్చిపోతున్నాయి. అభిజిత్ కి వ్యతిరేకంగా పోస్ట్ లు పెట్టిన వారిన ట్రోల్ చేస్తూ రెచ్చిపోతున్నారు.
ఇక అసలు అభిజిత్ ఎందుకు బిస్కెట్ అయ్యాడు.. ఎందుకు ట్రిక్ ప్లే చేసి ఈ టాస్క్ లో యాంటీ అయ్యాడు అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి బిబి హోటల్ టాస్క్ లో స్టాఫ్ మోనేజర్ అయిన అభిజిత్ వచ్చి న గెస్ట్ లని తన టాలెంట్ తో, మాటలతో ఇంప్రెస్ చేసి వారి హృదయాలని గెలుచుకుని.. వారికి బెస్ట్ సర్వీస్ అందించి స్టార్స్ న పొందాలి. కానీ, టాస్క్ బజర్ మోగగానే అభిజిత్ స్టార్స్ ని కొట్టేశాడు. ఇక్కడ వరకూ అందరూ యాక్సెప్ట్ చేశారు.. కానీ, తర్వాత హారిక చేతిలో స్టార్స్ పెట్టి క్యాజువల్ గా తీసుకుని నువ్వ ఐదు స్టార్స్ మాకు ఇచ్చావ్ అనే సరికి హారిక చాలా ఫీల్ అయ్యింది.
తన ఎమోషన్ తో , తన జెన్యూన్ గేమ్ తో ఆట ఆడుకున్నట్లుగా హారిక భావించింది. ఈ విషయాన్ని బిగ్ బాస్ ముందుర పెట్టేసింది. తను ఎంత జెన్యూన్ గా గేమ్ ఆడుతున్నానో బిగ్ బాస్ కెమెరాకి చెప్పి.. నేను ఇచ్చింది కేవలం ఒకే ఒక స్టార్ మాత్రమే మిగతా స్టార్స్ తో నాకు సంబందం లేదు అంటూ గోల చేసింది. ఇక్కడ అభిజిత్ ఎక్కడా తగ్గకుండా మాట్లాడుతున్నాడు. ఇది గేమ్ లో పార్ట్ అని, ఇది నా గేమ్ ప్లాన్ అని చెప్తున్నాడు.
నిజానికి హారిక అండ్ అభిజిత్ ఇద్దరూ కూడా హౌస్ లో ఫస్ట్ వీక్ నుంచి మంచి ప్రెండ్స్. వారిద్దరూ కలిసి రోబో టాస్క్ ని బాగా హ్యాండిల్ చేశారు కూడా. అయితే, ఇప్పుడు ఆపోజిట్ టీమ్స్ అవ్వడం వల్ల ఇద్దరూ కలిసి ఆడలేకపోయారు. అంతేకాదు, ఇదే విషయాన్ని దేత్తడి హారిక బిగ్ బాస్ కి కూడా చెప్పింది.. ఎందుకు బిగ్ బాస్ మా ఇద్దరినీ విడదీశావ్.. ఒకే టీమ్ లో వేయచ్చు కదా అని కూడా చెప్పింది. కానీ, అభిజిత్ నుంచి ఆశించినంత ఫీలింగ్ రాలేదు.. పైగా చీటింగ్ చేశాడు కూడా..ఫస్ట్ లో సరదాగా అంటున్నాడు అనుకున్నా కూడా అదే నిజం చేశాడు అభిజిత్. దాంతో హారిక చాలాసార్లు వచ్చి స్టార్స్ గురించి అడిగింది.
నిజానికి అభిజిత్ హారిక దగ్గర ఒకే ఒక స్టార్ తీసుకోవాలి. అయితే, ఈ స్టార్ తన దగ్గర కాకుండా.. బోర్డ్ పైన పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు హోటల్ స్టాఫ్ అందరికీ కలిపి స్టార్ ఇచ్చినట్లుగా అవుతుంది. ఇలా ఇండివిడ్యువల్ గా స్టార్ తీసుకుంటే ఉపయోగం ఉండదు. టాస్క్ లో ఉండే మజానే అది.
బిగ్ బాస్ హోటల్ టాస్క్ లో సర్వీస్ చేస్తుంది అందరూ కాబట్టి.., టీమ్ గా తన స్టాఫ్ ని గెలిపించాల్సిన బాధ్యత మేనేజర్ దే.. ఒక్కోసారి మేనేజర్ మాట స్టాఫ్ వింటారు.. ఒక్కోసారి వినరు. అయినా కూడా ఎక్కడా సహానాన్ని కోల్పోకుండా.. థింగ్స్ అన్నింటిన మ్యానేజ్ చేయగలిగే సత్తా ఉన్నవాడే మేనేజర్. అభిజిత్ మరి ఈ విషయంలో ఎంతవరకూ సక్సెస్ అవుతాడు అనేది ఆసక్తికరం. అంతేకాదు, ఈ టాస్క్ లో ఎవరు విన్ అవుతారు.. ఎవరు లూజ్ అవుతారు అనేది కూడా ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది.

Do NOT follow this link or you will be banned from the site!