Bathukamma Celebrations : రెండో రోజు ఘనంగా బతుకమ్మ సంబురాలు

NQ Staff - September 27, 2022 / 10:40 PM IST

Bathukamma Celebrations : రెండో రోజు ఘనంగా బతుకమ్మ సంబురాలు

Bathukamma Celebrations : తెలంగాణ బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి మహిళలు ఆడిపాడుతున్నారు. సంప్రదాయ నృత్యాలతో ఆడిపాడారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారు.

బతుకమ్మ సంబరాలు మూడో రోజుకు చేరుకున్నాయి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను ఆనందంగా జరుపుకున్నారు. రెండో రోజు అటుకుల బతుమ్మను కూడా ఘనంగా నిర్వహించారు.

కమాండ్ కంట్రోల్ కేంద్రంలో..

రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఊరూవాడల్లో ఉయ్యాల పాటలు మారుమోగుతున్నాయి. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఆవరణలో జరిగిన వేడుకల్లో హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. ప్రకృతి ప్రాధాన్యాన్ని బతుకమ్మ పండగ చాటి చెబుతోందని సీవీ ఆనంద్ తెలిపారు. ఈ వేడుకల్లో మహిళా కానిస్టేబుళ్ల నుంచి ఐపీఎస్ అధికారిణిలు పాల్గొని నృత్యాలు చేశారు.

కీసరలో బతుకమ్మ సంబురాలు..

మేడ్చల్ జిల్లా కీసరలో చీర్యాల ఈడెన్‌గార్డెన్‌లో బతుకమ్మవేడుకలు ఘనంగా సాగాయి. ఆ వేడుకల్లో కాలనీవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖమ్మంలో సంబురాలు అంబరాన్ని అంటాయి. పలు కాలనీల్లో కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తీరోక్క పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు వాటి ముందు ఆడిపాడారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేటలోని ప్రైవేట్‌పాఠశాలలో వేడుకలను ఘనంగా జరిపారు.

జగిత్యాలలో ఆడిపాడిన ఎమ్మెల్సీ కవిత..

జగిత్యాలలో విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి ఆట పాటలతో సంబురాలు చేసుకున్నారు. రాష్ట్రంఏర్పడిన తర్వాతే బతుకమ్మ పండుగకు విశిష్టత వచ్చిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని మినీ స్టేడియంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంబురాలకు హాజరయ్యారు. మహిళలతో కలిసి ఆడిపాడారు.

Read Today's Latest Bathukamma in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us