Connect with us

Latest News

తెలంగాణాలో నేటి నుండే బతుకమ్మ వేడుకలు షురూ

Published

on

Share the News from here

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండగకు మంచి గుర్తింపు ఉంది. అయితే సాధారణంగా ప్రతి పూజలో దేవుళ్లను పువ్వులతో పూజిస్తాం.. ఇక ఆ పువ్వులనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణది. తీరొక్క పువ్వు తెచ్చి పెత్తరమాస రోజున బతుకమ్మ పండగ మొదలవుతుంది. ముఖ్యంగా బతుకమ్మ పూజలో గౌరమ్మ ప్రత్యేకం అని చెప్పాలి. ఇక బతుకమ్మ ను అలంకరించే పువ్వులలో తంగేడు పువ్వు, గునుగు పువ్వు చాలా ప్రత్యేకం. అలాగే తీరొక్క పువ్వులతో కూడా బతుకమ్మను అలంకరిస్తారు తెలంగాణ ఆడపడుచులు. అలా ఎంగిలి పూల బతుకమ్మ గా మొదలయ్యి తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా వేడుకలు ముగిస్తాయి.

తొలి రోజు : ఎంగిలి పూల బతుకమ్మ
రెండవ రోజు : అటుకుల బతుకమ్మ
మూడవ రోజు : ముద్దపప్పు బతుకమ్మ
నాలుగవ రోజు : నానబియ్యం బతుకమ్మ
ఐదవ రోజు : అట్ల బతుకమ్మ
ఆరవ రోజు : అలిగిన బతుకమ్మ
ఏడవ రోజు : వేపకాయల బతుకమ్మ
ఎనిమిదవ రోజు : వెన్నముద్దల బతుకమ్మ
తొమ్మిదవ రోజు : సద్దుల బతుకమ్మ

Do NOT follow this link or you will be banned from the site!