Harley Davidson: హార్లే డేవిడ్సన్‌ నయా ఎలక్ట్రిక్‌ బైక్ వ‌చ్చేసింది.. యారో ఆర్కిటెక్చర్‌ టెక్నాలజీతో..

NQ Staff - February 21, 2022 / 11:03 AM IST

Harley Davidson: హార్లే డేవిడ్సన్‌ నయా ఎలక్ట్రిక్‌ బైక్ వ‌చ్చేసింది.. యారో ఆర్కిటెక్చర్‌ టెక్నాలజీతో..

Harley Davidson: ప్రస్తుతం అందరూ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు మారతుండటంతో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. చిన్న కంపెనీలతో పాటు బడా కంపెనీలు సైతం అదే రూట్ లో నడుస్తున్నాయి. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునేందుకు అనేక ప్రయాత్నాలు చేస్తూ కొత్త కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. మరో వైపు పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ కావడంతో చాలా మంది ఎలక్ట్రిక్ బైక్ లను యూజ్ చేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

Harley Davidson Electric Bike

Harley Davidson Electric Bike

దీంతో వాహనదారులకు అభిరుచికి అనుగుణంగా వెహికిల్స్‌ను డిజైన్ చేస్తున్నాయి. ఇక అమెరికాకు చెందిన హర్లే డేవిడ్సన్ కంపెనీ అతి త్వరలోనే మరో ఎలక్ట్రిక్ బైక్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. లైవ్‌వైర్‌ బ్రాండ్‌ కింద మార్కెట్లోకి రాబోతోంది. ఈ బైక్‌‌కు S2Del Mar గా పేరు పెట్టారు. ఈ కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ మిడిల్‌ వెయిట్‌ విభాగంలోనికి వస్తుంది. యారో ఆర్కిటెక్చర్‌తో రూపొందించిన ఈ బైక్‌లో బ్యాటరీ, ఛార్జర్‌, స్పీడ్‌ కంట్రోలర్‌, ఇన్వర్టర్‌ వంటివి ఉన్నాయి. రీజనబుల్ ధరలోనే ఈ బైక్ ఉండే ఛాన్స్ ఉంది.

ఈ బైక్‌లో యారో ఆర్కిటెక్చర్‌‌తో 21,700 రకాల సిలిండ్రికల్‌ సెల్స్‌ ఉన్న బ్యాటరీని ఉపయోగించారు. ఈ ఫార్మాట్‌ను టెస్లా, శాంసంగ్‌ వంటి పెద్ద కంపెనీలు సైతం ఉపయోగిస్తున్నాయి. వీటితో తైవాన్‌కు చెందిన ఈవీల తయారీ కంపెనీ కైమ్‌కో జత కలిసింది. సంస్థ ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ను మరో మూడు నాలుగు నెలల్లో మార్కెట్ లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం చాలా మంది బైక్ లతో పాటు కార్లు సైతం ఈవీలకు సంబంధించిన వాటికే ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. దీనికి తోడు ప్రభుత్వం సైతం ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ ఇస్తుండటంతో చాలా మంది వీటిని కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. వీటితో పాటు పలు పెద్ద కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను మార్కెట్ లోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Read Today's Latest Automobile in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us