Connect with us

Latest News

బీజేపీ నేతల పై టీడీపీ నేతలకు ఎందుకంత ప్రేమ!!

Published

on

Share the News from here

పూర్తిగా కోల్పోయిన ప్రజాధరణను మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. 2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాల వల్ల టీడీపీ నేతల్లో ఉత్సహం పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో నూతన ఉత్సహం నింపడానికి పార్టీ యొక్క అధికారాన్ని కూడా అచ్చెన్నాయుడుకి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇంకో కొత్త వ్యూహం ఒకటి బీజేపీని ఆధారంగా చేసుకొని రచించారు.

పురందేశ్వరీ జాతీయ నేత కాదు జాతి నేత అంటూ వైసీపీ నేత విజయ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల కంటే కూడా టీడీపీ నాయకులే ఎక్కువ ఫీల్ అవుతున్నారు. టీపీడీ అధినేత ఎన్టీఆర్ యొక్క కుమార్తెను విమర్శించే అర్హత నీకుందా అంటూ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. బీజేపీ యొక్క స్నేహం కోసమే టీడీపీ నాయకులు ఇలా బీజేపీ నాయకుల పట్ల ప్రేమను నటిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వైసీపీని దెబ్బ తియ్యడానికి తన ఒక్కడి శక్తి సరిపోదని భావించిన బాబు మళ్ళీ ఈ పొత్తుల రాజకీయం మొదలు పెట్టారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Do NOT follow this link or you will be banned from the site!