Connect with us

Health

ఏపీలో మరో మంత్రికి కరోనా

Published

on

Share the News from here

కరోనా ఎవ్వరిని వదలడం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా దారుణంగా విస్తరిస్తుంది. ఇప్పటికే ఆ రాష్టంలో చాలా మంది ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. ఇది ఇలా ఉంటె తాజాగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కరోనా సోకింది. అయితే ఇటీవలే తిరుమల బ్రహ్మోత్సవాల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇక మంత్రి వెల్లంపల్లి కి స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఇక ఈ పరీక్షల్లో మంత్రికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అలాగే చిత్తూరు జిల్లాలోని సత్యవేడు వైసిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనకు కూడా స్వల్ప లక్షణాలు కనిపించడంతో వైద్య అధికారులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Do NOT follow this link or you will be banned from the site!