Connect with us

Latest News

హైదరాబాద్ లో పరువు హత్య.. అమృత, ప్రణయ్ ఘటన తలపించేలా

Published

on

Share the News from here

హైదరాబాద్ నగరంలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారని యువతి తండ్రి కక్షగట్టి దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే చందానగర్ లో నివసిస్తున్న హేమంత్ అనే యువకుడు ఇదే ప్రాంతానికి చెందిన అవంతి రెడ్డి అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే ప్రేమించి పెళ్లిచేసుకోవడం ఆ యువతి తండ్రి లక్ష్మారెడ్డికి ఇష్టం లేకపోవడంతో కిరాయి మనుషులతో యువకుడిని కిడ్నాప్ చేసి, సంగారెడ్డి లో హత్య చేయించాడు. ఈ యువ జంట చేసుకున్న తరువాత యువతి తండ్రికి భయపడి చందానగర్ నుంచి వచ్చి గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో ఉంటున్నారు.

నిన్న ఆ ప్రేమ జంటను గచ్చిబౌలిలో కిడ్నాప్ చేయగా యువతి కారులో నుండి పారిపోయి 100కి సమాచారం ఇచ్చింది. ఇక యువతి పిర్యాదు మేరకు గచ్చిబౌలిలో కిడ్నాప్ కేసు నమోదు అయింది. ఇక ఆ యువకున్ని సంగారెడ్డి తీసుకువెళ్లి హత్య చేయడంతో అక్కడ హత్య కేసు నమోదైంది. ఇక ప్రస్తుతం ఆ యువకుడు హేమంత్ మృతదేహం ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసులో అమ్మాయి తల్లిదండ్రులతో పాటు 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Do NOT follow this link or you will be banned from the site!