Connect with us

Latest News

ఏపీలో దారుణం.. ప్రేమించలేదని యువతి సజీవదహనం

Published

on

Share the News from here

ప్రేమ కోసం కొంతమంది ఆకతాయిలు దారుణానికి ఒడిగడుతున్నారు. ప్రేమించలేదని ఓ యువతి పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ కిరాతక యువకుడు. వివరాల్లోకి వెళితే ఏపీలోని కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన యువతి విజయవాడలో ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. ఇక అక్కడే ఆమె ఓ ఇంట్లో కిరాయికి ఉంటుంది. అయితే శ్రీరాంపురానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి ఆమెను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇక అతడి వేధింపులు రోజురోజుకు మరింత ఎక్కువ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడిని పోలీసులు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఇక ఈ విషయాన్నీ మనుసులో పెట్టుకున్న ఆ యువకుడు దారుణానికి ఒడిగతాడు. సదరు ఆ యువతి విధులు నిర్వర్తించి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఆమె పై దాడి చేసాడు. ఇక ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ఆవేశానికి గురైన ఆ యువకుడు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఆ యువతి పై పోసి నిప్పటించాడు. ఇక ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఇక ఆ యువతి మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Do NOT follow this link or you will be banned from the site!