Connect with us

Health

మరో కేంద్ర మంత్రికి కరోనా

Published

on

Share the News from here

భారత్ లో కరోనా రోజు రోజుకు ఉగ్రరూపం దాల్చుతుంది. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులు చాలా మంది కరోనా బారిన పడ్డారు. అయితే రాజకీయాల్లో కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలా చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఇది ఇలా ఉంటె తాజాగా మరో కేంద్ర మంత్రికి కరోనా సోకింది. అయితే కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్‌ కూడా కరోనా బారిన పడ్డారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు కరోనా లక్షణాలు ఉండడంతో టెస్టులు చేయించుకున్నాడు. దీనితో ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. పాజిటివ్ రావడంతో వైద్యులను సంప్రదించి చికిత్స పొందుతున్నానని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అలాగే ఇటీవలే తనను కలిసిన వారందరు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించాడు.

Do NOT follow this link or you will be banned from the site!