ysrcp : ఒకే ఒక్క మహిళా వాలంటీర్ టీడీపీ పార్టీ మొత్తానికి చెమటలు పట్టిస్తోంది

village volunteer contesting in panchayat elections from ysrcp
village volunteer contesting in panchayat elections from ysrcp

ysrcp : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైకాపా మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అందుకే గెలుపు ఖాయం అనుకున్న వారికి మాత్రమే సీటు ఇస్తున్నారు. గ్రామాల్లో మంచి గుర్తింపు ఉన్నట్లుగా ఎవరైనా కనిపిస్తే వారిని బలవంతంగా లేదా బతిమిలాడి తమ పార్టీలో చేర్చుకోవడం చేస్తున్నారు. అలా చేసి తమ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా రంగంలోకి దించుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ప్రసన్నాయపల్లి లో వైకాపా తరపున వాలంటీర్‌ సత్యవతిని ఎంపిక చేయడం జరిగింది. ఆమెను రంగంలోకి దించడం వల్ల ఖచ్చితంగా గెలుపు సాధ్యం అవుతుందని ఆ పార్టీ నాయకులు నమ్మకంగా చెప్పారు. దాంతో స్వయంగా ఎమ్మెల్యే రంగంలోకి దిగి ఆమెతో ఓకే చెప్పించారు.

village volunteer contesting in panchayat elections from ysrcp
village volunteer contesting in panchayat elections from ysrcp

మొదట సత్యవతి పోటీకి కాస్త వెనుక ముందు ఆడినా కూడా ఎమ్మెల్యే ప్రకాష్‌ రెడ్డి ఆమెను ఒప్పించాడట. ఆమె కు గ్రామంలో మంచి పేరు ఉంది. వాలంటీర్ గా ఆమె అందించన సేవల గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే ఆమెను బెస్ట్‌ వాలంటీర్ గా గుర్తించి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అందుకే ఇప్పుడు ఆమెకు సర్పంచ్‌ పదవి ఇస్తే మరింతగా ఆమె సేవ చేస్తుందనే నమ్మకం గ్రామస్తులకు ఉంది. అందుకే ఆమెకే సర్పంచ్ పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా వైకాపా ప్లాన్‌ వర్కౌట్‌ అవ్వబోతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ నాయకులు కాస్త అటు ఇటు అవుతున్నారు.

వాలంటీర్లకు ప్రజలకు సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. వారిని అన్ని విధాలుగా ప్రజలు నమ్ముతున్నారు. కనుక వారే సర్పంచ్ లు గా నిలిస్తే ఖచ్చితంగా ప్రజలు తెలిసి లేదా తెలియక వారికే ఓట్లు వేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే తెలుగు దేశం పార్టీ ఆశలపై నీళ్లు జల్లినట్లుగా అవుతుంది. అందుకే ఆ మహిళ వాలంటీర్‌ అభ్యర్థి ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ నాయకులకు చెమటలు పట్టిస్తున్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి మహిళా వాలంటీర్ విషయంలో ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement