అచ్చెన్నా నిన్ను నువ్వు కాపాడుకో.. పెద్ద ఉపధ్రవం రానుంది

Admin - October 29, 2020 / 12:57 PM IST

అచ్చెన్నా నిన్ను నువ్వు కాపాడుకో.. పెద్ద ఉపధ్రవం రానుంది
టీడీపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వం మీద మెల్లగా వాయిస్ పెంచుతున్నారు.  వైసీపీ నేతల మీద చురకలు విసురుతున్నారు.  ఉత్తరాంధ్ర వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి అమరావతి రెఫరెండం మీద ఉప   ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేసున్నారు.  దీంతో ఉత్తరాంద్ర వైసీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు.  ఆల్రెడీ అచ్చెన్నాయుడు గురించి వైసీపీ లీడర్లకు బాగా తెలుసు.  తగులుకుంటే వదిలే రకం కాదు.  సందు చిక్కితే చెడుగుడు ఆడుకునే రకం.  అందుకే ఆయన్ను ఆదిలోనే తొక్కిపట్టాలని వైసిపీ నేతలు ప్లాన్  చేస్తున్నారు.  ఇప్పటికే ఈఎస్ఐ స్కామ్ ఆరోపణలు ఆయన మీదుండగా కొత్తగా ఏదైనా తీగ లాగాలని ట్రై చేస్తున్నారు.

atchannaidu

ఆ ప్రయత్నంలో వారికి తిత్లీ తుఫాన్ తీగ తగిలిందట.  2018 అక్టోబర్ 8, 12 వ తేదీల మధ్యన సంభవించిన ఈ తుఫాన్ శ్రీకాకుళం జిల్లాను పెద్ద ఎత్తున   దెబ్బతీసింది.  ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోయారు.  అప్పుడు పర్యటనకు   వెళ్లిన చంద్రబాబు ప్రజలకు ఆదుకుంటామని పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు.  ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున సహాయ, పరిహార నిధులు విడుదలైనట్టు  చెప్పారు.  కానీ ప్రజలకు అందింది మాత్రం తక్కువే.  ఇప్పుడు ఈ కూపీనే  లాగాలని చూస్తున్నారట.
చంద్రబాబు హయాంలో అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నారు.  ఆ టైంలో తిత్లీ వరద సహాయ నిధులను భారీగా పక్కదారి పట్టించారని ఆరోపిస్తున్నారు.  అప్పట్లోనే వరద సహాయం నేతల జేబుల్లోకి వెళ్లిపోయిందనే వార్తలు వచ్చాయి.
అందుకే సమగ్ర విచారణ జరిపి లెక్కలతో సహా జనం ముందు పెట్టాలని వైసీపీ నేతలు భావిస్తున్నారట.  ఆ లెక్కలతో అచ్చెన్నను ఇరుకునపెట్టాలని ఇంకోసారి తమ జోలికి రాకుండా చేయాలని వైసీపీ నేతలు అనుకుంటున్నారట.  ఇదే గనుక జరిగితే అచ్చెన్నాయుడు మరోసారి ఇరుకునపడటం ఖాయం.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us