YSRCP Leaders Countered Pawan Kalyan Comments : పవన్ వరద కామెంట్స్ కి వైకాపా సూపర్ కౌంటర్
NQ Staff - July 29, 2023 / 04:10 PM IST

YSRCP Leaders Countered Pawan Kalyan Comments
పవన్ కళ్యాణ్ పేదలకు మంచి జరిగితే ఓర్చుకోలేడని మరో సారి నిరూపితం అయింది అంటూ వైకాపా నాయకులు, కార్యకర్తలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కురిసిన వర్షాలు.. దాంతో వచ్చిన వరదలపై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో వరదలు వచ్చాయి. అత్యంత ప్రసిద్ధి గాంచిన నగరాల్లో కూడా వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. చంద్రబాబు నాయుడు తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాను అంటూ చెప్పుకునే హైదరాబాద్ని కూడా వర్షాలతో వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే.
ఎక్కడైనా వరదలు వస్తే తాత్కాలిక ఇబ్బందులు తప్పవు. దానికి ప్రభుత్వ లోపమని.. మరేదో అంటూ రాజకీయం చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ పవన్ కళ్యాణ్ పై వైకాపా నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
వారం రోజుల పాటు కురిసిన వర్షంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా వరద నీరు చేరింది. అలాంటిది ఒక కాలనీకి పోయి అక్కడ ఇల్లు ఇంకా రోడ్లు నీళ్లతో ఉండడం చూపించి ప్రభుత్వాన్ని విమర్శించడం కరెక్ట్ కాదని.. ప్రజలు సంతోషంగా ఇల్లు కట్టుకొని ఉంటున్న వేళ ఫోటోలు దిగి అక్కడికి వెళ్లి స్మశానం అంటూ విమర్శలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ సామాన్యుల సైతం పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి కుల్లు రాజకీయాలు మానక పోతే మరో సారి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు అంటూ వైకాపా నాయకులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి హెచ్చరిస్తున్నారు.