CBN Support To Swetha Chowdary : స్వాతిరెడ్డికి సపోర్టుగా బాబు ట్వీట్. ఇదేందయ్యా చంద్రం ?

NQ Staff - June 29, 2023 / 10:18 PM IST

CBN Support To Swetha Chowdary : స్వాతిరెడ్డికి సపోర్టుగా బాబు ట్వీట్. ఇదేందయ్యా చంద్రం ?

CBN Support To Swetha Chowdary :

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయ్యుండి, బిల్ గేట్సు, ఒబామా లాంటి వాళ్లకే డౌట్సొచ్చినా క్లియర్ చేసేంత అపార మేధావయిన నారా చంద్రబాబు, ఈ మధ్య చేస్తోన్న కొన్ని పనుల వల్ల తప్పులో కాలేసి, పబ్లిక్ తో అక్షంతలేయించుకుంటున్నాడు. టీడీపీకి ఫేవర్ గా పనిచేస్తోన్న స్వాతిరెడ్డి అనే ఎన్ ఆర్ ఐ కి సపోర్టుగా, భరోసానిచ్చే బాసు స్థాయిలో ఓ ట్వీట్ వదిలాడు. టీడీపీ కోసం పనిచేస్తున్న మహిళను కొందరు వైసీపీ అభిమానులు, కార్యకర్తలు ఇబ్బందిపెడుతన్నారంటూ వాపోయాడు. ఇలా మహిళల్ని కించపర్చడం అనైతికమనీ, ఇలాంటివి భావ ప్రకటన స్వేచ్చకీ, ప్రజాస్వామ్యానికి మంచివి కావని ట్వీట్ చేశారు.

ట్విట్టర్ అకౌంట్ ఉన్న ఎవరైనా ట్వీట్ చేయడం సింపులే. కానీ బాబులాంటి మేధా సంపన్నులు వెనకా ముందు తెలుసుకోకుండా ఇలా ఓ ట్వీట్ ఎలా చేశారంటూ వైసీపీ శ్రేణులు కౌంటర్లేస్తున్నారు. ఎక్కడయినా ఏ విషయంలో అయినా చర్యకు ప్రతిచర్య ఉంటుందనే ప్రాథమిక సూత్రాన్ని బాబు గారు గుర్తుంచుకోవాలి. ఇదే సదరు స్వాతిరెడ్డి వైసీపీ మహిళా మంత్రుల్ని, సీఎం జగన్ కుటుంబంలోని మహిళల్ని, లేడీ జడ్పీటీసీలను హద్దులు దాటి మరీ కించపరస్తూ ట్వీట్స్ పెట్టినప్పుడు బాబు గారు జుకెర్ బర్గ్ కి జూమ్ కాల్ లో క్లాసులు చెప్తూ బిజీగా ఉన్నారా? అంటూ వైసీపీ కార్యకర్తలు కన్నెర్ర చేస్తున్నారు.

స్వాతిరెడ్డి చేస్తోన్న అసభ్యకర ట్వీట్లు, జుగుప్సాకర కామెంట్లతో కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాకే ఈ స్థాయిలో రియాక్షన్ వచ్చిందనీ, గతం తెలుసు కోకుండా 25వేల ఫాలోవర్లున్న ఓ ఎన్ ఆర్ ఐ అయిన టీడీపీ భజనపరురాలు స్వాతిరెడ్డికి మాజీ సీఎం అన్న హోదాని కూడా మర్చిపోయి ట్వీటేయడం బాబు గారికి చెల్లిందంటూ వైసీపీ అభిమానులు సోషల్మీడియాలో చురకలంటిస్తున్నారు. సదరు స్వాతిరెడ్డి వైసీపీ మహిళా నేతల్ని అన్నేసి మాటలంటూ ట్వీట్లు పెడుతుంటే అప్పుడు మాత్రం ప్రజాస్వామ్యానికి అవరోధం అనిపించలేదా? అప్పుడు మనోభావాలు గుర్తురాలేదా? మీ వాళ్లు చేస్తే సమ్మటి ట్వీట్లు, అవతలి వాళ్లు చస్తే సమ్మెట పోట్లా చంద్రబాబు గారు? అంటూ స్ట్రాంగ్ కౌంటర్లిస్తున్నారు జగన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్.

పైగా సోషల్మీడియాలో స్వాతిరెడ్డి గురించిన మరో టాపిక్ కూడా వైరల్ గా మారింది. టీడీపీకి ఫేవర్ గా ట్వీట్లు చేసే తన పేరు స్వాతిరెడ్డి కాదనీ, తన అసలు పేరు శ్వేతా చౌదరనీ వినిపిస్తోంది. బాబు కూడా తన ట్వీట్ లో స్వాతిరెడ్డి అనే ఫేక్ పేరుతోనే ట్వీట్ చేశారు. చంద్రబాబు డైరెక్షన్లోనే శ్వేతా చౌదరి అలియాస్ స్వాతిరెడ్డి ట్వీట్స్ వ్యవహారం నడుస్తోందన్న చర్చ కూడా జరుగుతోంది. ఓ వైపు బయట జరుగుతున్న డ్యామేజీనే కంట్రోల్ చేసుకోడానికి కష్టపడుతున్న బాబు అండ్ కో కి ఇలా సోషల్మీడియాలోనూ ఎదురుదెబ్బలే తగులుతుంటే సైకిల్ ని ఎలా నెట్టుకొస్తాడో పాపం.

 

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us