ys jagan : అదొక్కటీ కొట్టు జగనన్నా, పంచాయతీ ఎలక్షన్స్ ఓడిపోయినా పర్లేదు అంటోన్న జగన్ ఫ్యాన్స్!

ys jagan : ఏపీలో అధికార పార్టీ వద్దు వద్దంటున్నా పంచాయతీ ఎన్నికలు వచ్చేశాయి. దీంతో ఇక వైఎస్సార్సీపీ బతకు జీవుడా అంటూ పోరాటం చేయకతప్పని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే.. ఎలక్షన్స్ ఎలాగూ ఇప్పట్లో రావు, మా జగనన్న రానీయడు అని బలంగా నమ్మిన గ్రామ స్థాయి నాయకులు అభ్యర్థులను రెడీగా పెట్టుకోలేదు. ఊహించని విధంగా ఎన్నికలు రావటంతో ఇప్పటికిప్పుడు సరైన క్యాండిడేట్లను వెతుక్కోవటం ఆ పార్టీకి కష్టంగా మారింది.

టీడీపీ.. స్పీడు..

ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, జగన్ ని ఎప్పుడు కసితీరా ఓడించాలా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం చాలా స్పీడుగా వ్యవహరిస్తోంది. పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల్ని ఇప్పటికే సిద్ధం చేసి పెట్టుకుంది. అస్త్రశస్త్రాలను బయటికి తీస్తోంది. అసలు ఈ ఎలక్షన్స్ వెనక, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక ఉన్నదే టీడీపీ అని వైఎస్సార్సీపీ నెత్తీనోరూ కొట్టుకుంటోంది. కాబట్టి తెలుగుదేశం దూకుడు మీద ఉందనటంలో డౌటే లేదు.

అదే మైనస్..ys jagan

అధికార పార్టీ అన్న తర్వాత పలుకుబడి కోసం పోటీ పడే గ్రూపులు ఎక్కువగా ఉండటం సహజం. వైఎస్సార్సీపీకి కూడా అదే పెద్ద మైనస్ పాయింటుగా మారింది. అసలే ఎన్నికలకు రెడీగా లేకపోతిమిరా అంటూ ఒక వైపు బాధపడుతుంటే మరో వైపు ఈ వర్గ రాజకీయాలు జగన్ పార్టీని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఒకే చోట ఒకరిద్దరు రెబల్స్ నామినేషన్లు వేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెబుతున్నారు. వాళ్లను బుజ్జగించి పోటీ నుంచి తప్పించే లోపు పుణ్యకాలం కాస్తా గడిచిపోతుందని బెంగ పెట్టుకుంటున్నారు.

ఆ ఒక్కటీ..

పంచాయతీ ఎన్నికలే ఇంకా మొదలు కాలేదు. అప్పుడే గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎలక్షన్స్ తెర మీదికి వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగానే మునిసిపాలిటీలకు, కార్పొరేషన్లకు కూడా ఎలక్షన్స్ పెడతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాగూ పార్టీల గుర్తులతో జరగవు కాబట్టి వాటిలో ఓడినా పెద్దగా నష్టంలేదు గానీ పార్టీ గుర్తులతో జరిగే మునిసిపల్ ఎన్నికలను మాత్రం ప్రెస్టేజీగా తీసుకోవాలని వైఎస్సార్సీపీ కేడర్ భావిస్తోంది. పైగా విశాఖను పరిపాలన రాజధానిగా ఎంపిక చేసుకున్నారు కాబట్టి అక్కడ ఎట్టిపరిస్థితుల్లోనూ నెగ్గితీరాలని సీఎం జగనన్నకు తేల్చిచెబుతున్నారు.

Advertisement