ys jagan : ఇంత హడావిడిగా జగన్ ఎందుకు ఆ ఊరు బయలుదేరాడు?.. నిమ్మగడ్డ కూడా షాక్ అయ్యే మ్యాటర్ ఇది..

ysjagan-what-is-this-urgency-for-ys-jagan
ysjagan-what-is-this-urgency-for-ys-jagan

ys jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి ఒకటిన అనంతపురానికి వెళుతున్నారు. ఈ విషయాన్ని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి నిన్న (గురువారం) అధికారికంగా ప్రకటించారు. ఆ రోజు ఉదయం పది గంటలకు అనంతపురం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే ఒక కార్యక్రమంలో జగన్ పాల్గొనబోతున్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీకి అందజేస్తున్న వాహనాలను సీఎం ఆ రోజు ప్రారంభించనున్నారు.

ఉన్నపళంగా..

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉన్నట్టుండి జిల్లా పర్యటనకు వెళుతుండటం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా షాక్ అయ్యే మేటర్ ఇందులో ఉందని అంటున్నారు. ఈ టూర్ లో భాగంగా జగన్ వైఎస్సార్సీపీ నాయకులతో కూడా సమావేశం అవుతారని తెలుస్తోంది. జిల్లాలోని సాధ్యమైనన్ని ఎక్కువ గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేయించాలని సూచించనున్నట్లు సమాచారం. అసలే బలవంతపు ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ నిఘా పెట్టారు కాబట్టి జగన్ పర్యటన పైన కూడా ఆయన నుంచి ఏమైనా అభ్యంతరాలు వస్తాయేమో చూడాలి.

‘పవర్’ ఫుల్లుగా..ys jagan

రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ గ్రామ పంచాయతీల్ని వైఎస్సార్సీపీ ఖాతాలో వేయించటం ద్వారా టీడీపీ, బీజేపీ, జనసేన తదితర ప్రతిపక్ష పార్టీలకు తన పవరేంటో మరోసారి చూపించాలని ముఖ్యమంత్రి జగన్ పట్టుదలతో ఉన్నారు. పైగా పంచాయతీ ఎన్నికల్ని బలవంతంగా తెచ్చిపెట్టిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి కూడా పరోక్షంగా పంచ్, కౌంటర్ వేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలంటూ అన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను జగన్ ఇప్పటికే ఆదేశించారు.

సంక్షేమం ఓకే..

జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమ పథకాలపై చాలా శ్రద్ధ పెట్టారు. దాదాపు అన్ని ఇళ్లల్లోనూ ప్రతి ఒక్కరికీ ఏదో ఒక స్కీమ్ ద్వారా ఆర్థికంగా లబ్ధి చేకూర్చుతున్నారనే గుడ్ విల్ సంపాదించారు. వాలంటీర్ల వ్యవస్థ వండర్ ఫుల్ అనే ప్రశంసలు పొందుతున్నారు. ఈ ప్రభావం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా స్పష్టంగా కనిపించటం ఖాయం. అదే సమయంలో డెవల్మెంట్ ప్రోగ్రామ్స్ పైనా మరింత ఫోకస్ పెడితే బాగుంటుందనే సూచనలు, సలహాలు వస్తున్నాయి.

Advertisement