YS jagan : ఎలక్షన్ కి ఒక్కరోజు ముందు అచ్చెన్నాయుడు అరెస్ట్ – జగన్ మాస్టర్ స్కెచ్ ?

YS jagan : ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల రీషెడ్యూల్ ప్రకారం తొలి దశ పోలింగుకి రేపటి(శుక్రవారం) నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో దీనికి ఒక్క రోజు ముందు అంటే ఇవాళ అధికార పార్టీ వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసేందుకు సీఎం వైఎస్ జగన్ మాస్టర్ స్కెచ్ వేసినట్లు వార్తలు రావటమే దీనికి కారణం.

నోటీసు..

ఏపీలో ఎట్టకేలకు ముగిసిందనుకున్న హిందూ దేవుళ్ల విగ్రహాల రాజకీయం మళ్లీ మొదలైంది. అచ్చెన్నాయుడి అసెంబ్లీ సెగ్మెంటైన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని సంతబొమ్మాళి మండలం పొలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వటం సంచలనం రేపుతోంది. మండలంలోని పాలేశ్వరస్వామి గుడిలో పాడైపోయిన నంది విగ్రహాన్ని రీసెంటుగా తీసేసి కొత్త విగ్రహాన్ని పెట్టారు. ఇదే తాజా వివాదానికి అసలు కారణం.

వైఎస్ఆర్: YS jagan

ఈ క్రమంలో శిథిలమైన విగ్రహాన్ని కొందరు తీసుకొచ్చి పాలేశ్వరస్వామి టెంపుల్ జంక్షన్ వద్ద ఉన్న సిమెంట్ దిమ్మెపై పెట్టి వెళ్లిపోయారు (ఈ దిమ్మె మీద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మను ఏర్పాటుచేయాల్సి ఉంది). ఈ నెల 14న జరిగిన ఈ సంఘటన కలకలం రేపుతోంది. దీనికి కారకులైనవాళ్లు అంతకుముందు రోజే అచ్చెన్నాయుడిని కలిసినట్లు పోలీసులు కనుక్కున్నారు.

కేసులు..

ఇప్పటికే విగ్రహాల విధ్వంసం వ్యవహారం ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాలకు, విమర్శలకు, ఆరోపణలకు కారణమైన సంగతి తెలిసిందే. దీంతో అలర్టుగా ఉన్న పోలీసులు ఈ గొడవ మరింత ముదరకముందే 16 మంది నిందితులను పట్టుకొని కేసులు బుక్ చేశారు. ఇందులో అచ్చెన్నాయుడి పాత్రేంటో తేల్చేందుకే ఆయనకు సెక్షన్ 41-ఏ కింద నోటీసులు పంపారు.

YS-jagan-master-plan-to-arrest-achenna
YS-jagan-master-plan-to-arrest-achenna

ప్రజెంట్ సార్: YS jagan

ఈ వ్యవహారంలో నోటీసులు అందుకున్న స్థానిక ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఇవాళ (గురువారం) మధ్యాహ్నం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు వచ్చి డీఎస్పీ శివరామిరెడ్డి వద్ద విచారణకు హాజరయ్యారు. విచారణ పూర్తయిన అనంతరం ఆయన తిరిగి పలాసలోని టీడీపీ ఆఫీసుకి వెళ్లిపోయారు. అచ్చెన్నాయుడి పాత్ర ఎంత వరకు ఉందో తెలుసుకున్నాక అవసరమైతే ఆయనపై కేసులు పెడతామని అంటున్నారు.

Advertisement