YS vs JD : ‘ఆ పార్టీ’లో జాయిన్ అవుతున్న జేడీ లక్ష్మీ నారాయణ – ఆ పార్టీ కార్యకర్తల డ్యాన్సులే డ్యాన్సులు !

YS vs JD : వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ అంటే ఎవరికీ తెలియదు. జేడీ లక్ష్మీనారాయణ అంటే తెలియనివారు ఉండరు. జేడీ అంటే జాయింట్ డైరెక్టర్. లక్ష్మీనారాయణ.. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లో జేడీ హోదాలో పనిచేసేవారు. దీంతో జేడీ అనేది ఆయన ఇంటి పేరుగా మారింది. ముఖ్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయటంతో దేశవ్యాప్తంగా పాపులరయ్యారు. జేడీ తెలుగువారు కావటంతో ఏపీ, తెలంగాణల్లో ఆయనకు అప్పట్లో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కానీ.. సీబీఐ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని, జనసేన పార్టీలో చేరి, 2019 ఎన్నికల్లో విశాఖలో పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు. తర్వాతి పరిణామాల్లో పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి కూడా బయటికి వచ్చేశారు.

అయితే?..

జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. గతంలోనే బీజేపీలో చేరాలని భావించినా తాను అనుకున్న విశాఖ సీటు ఖాయం కాకపోవటంతో ఆగిపోయారు. 2014 ఎలక్షన్లలో వైజాగ్ లో ఏకంగా జగన్ తల్లి, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మనే ఓడించిన హరిబాబుకే కమలం పార్టీ 2019లో టికెట్ ఇవ్వలేదు. ఆయనకు బదులు పురంధేశ్వరికి ఛాన్స్ ఇవ్వగా ఆమె లక్ష్మీనారాయణ కన్నా కింద మెట్టు వద్దే ఆగిపోయారు. అక్కడ వైఎస్సార్సీపీ నెగ్గగా కేవలం నాలుగున్నర వేల ఓట్లు మాత్రమే తక్కువ రావటంతో టీడీపీ రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. అఫ్ కోర్స్.. టీడీపీ, బీజేపీ వేర్వేరుగా పోటీ చేయటం కూడా జగన్ పార్టీకి కలిసొచ్చింది.

YS vs JD : laxminarayana will join in that party
YS vs JD : laxminarayana will join in that party

మరోసారి: YS vs JD

విశాఖ సీటు ఇచ్చేందుకు జనసేన ముందుకు రావటంతో జేడీ ఆ పార్టీలో చేరి తన వ్యక్తిగత ఇమేజీతో దాదాపు మూడు లక్షల ఓట్లు సాధించారు. ఓడిపోయినా అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈసారి అలాంటి తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నారంట. ‘ఫస్ట్ థాట్ ఈజ్ బెస్ట్ థాట్’ అన్నట్లు త్వరలో కమలం తీర్థం పుచ్చుకోబోతున్నారని సమాచారం. ఏపీలోని అధికార పార్టీ.. పరిపాలన రాజధానిగా వైజాగ్ ని సెలెక్ట్ చేసిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విశాఖ సీటుకి తీవ్ర పోటీ నెలకొననుంది. బీజేపీ నేత హరిబాబు మళ్లీ తెర మీదికి వస్తున్నారని అంటున్నారు. సీబీఐ కేసులతో జగన్ ని ఒక ఆటాడుకున్న లక్ష్మీనారాయణ ఆయన చేతిలోనే ఓడిపోయి ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఆ ఫైర్ కి తగ్గట్లే కాషాయం పార్టీ ఆయనకు టికెట్ కన్ఫాం చేస్తుందా లేదా అనేది చూడాలి. విశాఖలో బీజేపీ బలంగా ఉన్నమాటైతే నిజం.

Advertisement