YS Vijayalakshmi : చెల్లి కోసం అన్న.. అన్న కోసం చెల్లి: వైఎస్ విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు.!
NQ Staff - November 29, 2022 / 10:50 PM IST

YS Vijayalakshmi : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకీ మధ్య విభేదాలున్నాయంటూ తరచూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై గతంలోనే షర్మిల స్పష్టతనిచ్చారు.
అన్నగా వైఎస్ జగన్ మీద అభిమానం వుంటుందనీ, తెలంగాణలో రాజకీయం చేస్తున్నంతమాత్రాన అన్నతో విభేదాలున్నాయనడం సబబు కాదని షర్మిల చెప్పుకొచ్చారు గతంలోనే.
బ్లడ్ ఈజ్ థిక్కర్ దేన్ వాటర్…
నీటి కంటే రక్తం ‘థిక్’గా వుంటుందంటూ వైఎస్ విజయమ్మ చెప్పారు. రక్త సంబంధం అంత బలమైనందన్నది ఆమె ఉద్దేశ్యం. చెల్లి కోసం అన్న.. అన్న కోసం చెల్లి.. ఒకరికొకరు అండగా నిలబడతారని వైఎస్ షర్మిల చెప్పారు.
అంతకు ముందు వైఎస్ విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో, ఆంధ్రప్రదేశ్తో మనకేంటి సంబంధం.?’ అంటూ ప్రశ్నించడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. షర్మిల అరెస్టుపై వైఎస్ జగన్తో మాట్లాడారా.? అని విజయమ్మను ప్రశ్నించినప్పుడు ఆమె ఈ విధంగా స్పందించారు.
ఇంతలోనే, ‘బ్లడ్ ఈజ్ థిక్కర్ దేన్ వాటర్’ అంటూ వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించడం గమనార్హం.
చెల్లి కోసం అన్నా…అన్న కోసం చెల్లి ఇద్దరూ ఎప్పుడూ తోడుగా ఉంటారు – విజయమ్మ pic.twitter.com/yJEtFRr2pr
— 𝐘𝐒𝐑𝐓𝐏 (@YSSR2023) November 29, 2022