YS Sharmila : జగన్ పేరు మార్పు నిర్ణయాన్ని తప్పుబట్టిన వైఎస్ షర్మిల
NQ Staff - September 22, 2022 / 06:31 PM IST

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైయస్సార్ పేరు పెడుతూ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై తెలుగు దేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గొప్ప నాయకుడు.. నేత.. యూనివర్శిటీకి
పేరు పెట్టేందుకు పూర్తిగా అర్హుడు అయినా ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు ఎలా పెడతారంటూ వారి ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో సొంత పార్టీ నాయకుల నుండి కూడా జగన్ తీసుకున్న నిర్ణయానికి విమర్శలు వస్తున్నాయట.
కొత్తగా నిర్మించిన భవనాలకు లేదా యూనివర్సిటీలకు మన వాళ్ల పేర్లు పెడితే పర్వాలేదు.. కానీ ఇప్పటికే ఉన్న పేర్లు మార్చి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం సరైన నిర్ణయం కాదు అనేది చాలా మంది వాదన.

YS Sharmila Blamed Ap CM YS Jagan Mohan Reddy Decision
తాజాగా ఈ విషయమై వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె అయిన వైయస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల స్పందించారు. తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం షర్మిల తప్పు పట్టారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పేరు మార్చకూడదు, దాని పవిత్రత పోతుంది అన్నారు. ఒక పేరు పెట్టారంటే ఆ పేరును తర తరాల వరకు కంటిన్యూ చేస్తే వాళ్లకు గౌరవించినట్లు అవుతుంది.
ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ పోతే జనాలు కూడా అర్థం కాదని, కన్ఫ్యూజన్ పెరుగుతుందని షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు. తండ్రి పేరు పెడితే ఇలా సోదరుడిని విమర్శించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు వైకాపా నాయకులు ఆమెను ప్రశ్నిస్తున్నారు.