YS Jagan : బ్రేకింగ్ న్యూస్ : పంచాయతీ ఎన్నికల్లో జగన్ పార్టీ కొట్టిన మొదటి దెబ్బకే తెలుగుదేశం డకౌట్

YS Jagan : ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వానికి ఇవాళ(శుక్రవారం) తెరలేచింది. ఈరోజు, రేపు, ఎల్లుండు మూడు రోజుల పాటు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు తీసుకుంటారు. దీంతో రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దించే విషయంలో ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి.

ఫస్ట్ పంచ్..

పల్లె పోరులో ప్రతిపక్ష పార్టీలకు వైఎస్సార్సీపీ ఫస్ట్ పంచ్ వేసింది. తిరుగులేని ఈ కౌంటర్ కి తెలుగుదేశం కోలుకోవటం కష్టమే అంటున్నారు. తొలి విడత పంచాయతీ ఎలక్షన్ జరిగే 18 రెవెన్యూ డివిజన్లలో అనంతపురం జిల్లాలోని కదిరి కూడా ఒకటి. ఆ డివిజన్ పరిధిలోని రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లిలో అధికార పార్టీ అపొజిషన్ పార్టీకి అదిరిపోయే దెబ్బకొట్టింది. దీంతో పచ్చ పార్టీ డకౌట్ అయింది.

ది బెస్ట్: YS Jagan

వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్సీపీ ఏపీలో అధికారంలోకి వచ్చాక ప్రతి ఊరులోనూ సచివాలయాన్ని ఏర్పాటుచేసి వేల సంఖ్యలో వాలంటీర్లను నియమించిన సంగతి తెలిసిందే కదా. ఈ వ్యవస్థకి ప్రజల నుంచి మంచి స్పందన, ప్రశంసలు వస్తున్నాయి. ప్రసన్నాయపల్లి గ్రామంలో డిగ్రీ చదివిన సత్యవతి అనే యువతి వాలంటీర్ జాబుకి సెలెక్ట్ కావటమే కాకుండా విధి నిర్వహణలో అందరికన్నా ముందుంటోంది.

కాబోయే..

ప్రభుత్వ సత్సంకల్పానికి తగ్గట్లే సత్యవతి ఆ గ్రామంలోని నిరుపేదలకు సర్కారు పథకాలను సకాలంలో సమర్థవంతంగా అందించటం ద్వారా పది మందికీ తలలో నాలుకలా మెలుగుతోంది. అధికారులు ఆమెకి ఉత్తమ మండల వాలంటీర్ అవార్డు కూడా ప్రకటించారు. దీంతో మంచిగా పనిచేయటమే కాకుండా మండల స్థాయిలో తమ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సత్యవతిని ప్రెసిడెంట్ అభ్యర్థిగా నిలబెట్టాలని ఆ ఊరివాళ్లు నిర్ణయించారు.

YS-jagan-ysrcp-first-victory-in-panchayat-elections
YS-jagan-ysrcp-first-victory-in-panchayat-elections

గిఫ్ట్: YS Jagan

వాలంటీర్ గా ఎంపికైనప్పుడే సత్యవతి సమర్థతను ప్రసన్నాయపల్లి ప్రజలు గ్రహించారు. ఆమె కూడా వాళ్ల అంచనాల్ని నిలబెట్టింది. దీంతో సర్పంచ్ అభ్యర్థిగా సత్యవతి తప్ప మరెవరూ సరికాదని ఆ ఊరివాళ్లకు అనిపించింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెప్పగా ఆయన కూడా సమర్థించారు. మెజారిటీ జనాల అభిమానాన్ని చూరగొన్న సత్యవతే ప్రెసిడెంట్ గా గెలుస్తుందని స్థానికులు బల్లగుద్ది చెబుతున్నారు. ఫిబ్రవరి ఒకటిన అనంతపురం పట్టణానికి రానున్న సీఎం వైఎస్ జగన్ కి ఈ గెలుపును బహుమతిగా ఇవ్వబోతున్నామని వైఎస్సార్సీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement