YS Jagan : ‘‘నవ రత్నాలు’’ సక్సెస్.. ‘‘పంచ రత్నాలు’’ ఫెయిల్..

YS Jagan : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను అధికారంలోకి వస్తే తొమ్మిది సంక్షేమ పథకాలను అమలుచేస్తానని మాటిచ్చారు. ఆ పథకాలకు నవ రత్నాలు అనే పేరు కూడా పెట్టారు. ఈ ఐడియా బాగా క్లిక్ అయింది. ఆయన పార్టీ 2019 జనరల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ ఆలోచనను స్ఫూర్తిగా తీసుకొని ఆయన అభిమాని ఒకరు నిన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వేసిన ఎత్తుగడ చిత్తయింది.

ఎక్కడ?..

ఇది తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో జరిగింది. ఆ ఊరిలో పడాల రంగారెడ్డి అనే వ్యక్తి గ్రామ సర్పంచ్ క్యాండిడేట్ మేడిశెట్టి సురేఖ, 5వ వార్డు అభ్యర్థి కోనాల పేర్రెడ్డి తరఫున ఓ ప్రమాణ పత్రాన్ని విడుదల చేశారు. దాన్ని నోటరీ కూడా చేయించారు. అందులో ‘‘పంచ రత్నాలు’’ అనే పదాన్ని వాడాడు. ఆ ఇద్దరికి ఓటేసి గెలిపిస్తే ఏడాదిపాటు కేబుల్ టీవీ ప్రసారాలు, రేషన్, మినరల్ వాటర్, బీపీ-షుగర్ టెస్టులు ఉచితంగా అందిస్తానని మాటిచ్చాడు. పది మంది హైస్కూలు స్టూడెంట్లుకి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తాననీ అన్నారు.

అయినా: YS Jagan

ఈ ప్రమాణ పత్రం గురించి రెగ్యులర్, సోషల్ మీడియాల్లో ప్రముఖంగా వార్తలు రావటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఊబలంక అనేది పెద్ద ఊరే. మొత్తం గడపలు 1,884 కాగా వాటిలో 2,600 కుటుంబాలు నివసిస్తున్నాయి. జనాభా దాదాపు 8 వేలు. అంత మందికి ఏడాది పాటు ఈ పంచరత్నాలను ఫ్రీగా ఇవ్వాలంటే ఎన్ని డబ్బులు ఖర్చవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినప్పటికీ ఓటర్లను తమ వైపుకి తిప్పుకునేందుకు ఈ ప్రయత్నం చేశారు. కానీ ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సదరు సర్పంచ్ అభ్యర్థి గెలిచిన దాఖల్లాల్లేవు.

YS Jagan : ysrcp-chief-ys-jagan-navaratnalu-success-but-pancharatnalu-fail
YS Jagan : ysrcp-chief-ys-jagan-navaratnalu-success-but-pancharatnalu-fail

ఆ పేరు..

ఊబలంకలో మొత్తం 14 వార్డులుండగా వాటిలో ఏడు వార్డులతోపాటు ప్రెసిడెంట్ పదవికి పోటీచేస్తున్న తమను గెలిపిస్తే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ‘పంచ రత్నాలు’ అమలుచేస్తానని చెప్పినా నెగ్గలేకపోయాడు. నిన్నే వెలువడ్డ ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఈ రోజు (సోమవారం) పేపర్లలో వచ్చిన వార్తలను బట్టి చూస్తుంటే ఊబలంకలో కొక్కిరిగడ్డ లక్ష్మి అనే ఇండిపెండెంట్ విజయం సాధించినట్లు తెలుస్తోంది. ప్రమాణ పత్రం రాసినవారు నెగ్గినట్లు లేదు. రావులపాలెం మండలంలోని మొత్తం 12 గ్రామ పంచాయతీల్లో ఏకంగా పది చోట్ల వైఎస్సార్సీపీ మద్దతున్న క్యాండిడేట్లు సర్పంచ్ లుగా సక్సెస్ కాగా ఒక చోట టీడీపీ సపోర్ట్ ఉన్న అభ్యర్థి, మరో చోట ఇండిపెండెంట్ విక్టరీ సాధించారు. ప్రమాణ పత్రంలో సీఎం వైఎస్ జగన్ పేరును ప్రస్తావించారంటే వాళ్లు కూడా అధికార పార్టీ మద్దతున్నవాళ్లే అయుండాలి. అయినా పైచేయి సాధించలేదంటే ఈ ‘నవ రత్నాల’ ఇన్ స్పిరేషన్ తో రూపొందించిన ‘పంచ రత్రాల’ ప్లాను ఫెయిలైనట్లేనని భావించాల్సి ఉంటుంది.

Advertisement