YS jagan : ఇది జరిగితే రాజ్యాంగ సంక్షోభం ??

YS jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వదలని విక్రమార్కుడు. ఏదైనా సాధించాలి అనుకున్నాడంటే అది జరిగే వరకు వదిలిపెట్టదు. ఆ లక్షణమే ఆయన్ని ముఖ్యమంత్రిని చేసింది. అయితే ఆ క్రమంలో వైఎస్ జగన్ కి కొన్ని ఎదురు దెబ్బలు కూడా తగులుతున్నాయి. దీనికి మొదటి కారణం తొందరపాటుతనం కాగా రెండో కారణం అవగాహనలేమి అనిపిస్తోంది.

జాగ్రత్త..

పొలిటికల్ పార్టీకి చీఫ్ గా ఉన్నప్పుడు తప్పు చేస్తే తనకి, తన పార్టీకి మాత్రమే నష్టం కలుగుతుంది. కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఆయన ఇప్పుడు ఏపీకి సీఎంగా ఉన్నందున ఏ చిన్న పొరపాటు చేసినా ప్రతిపక్షాలు, మీడియా భూతద్దంలో పెట్టి చూపిస్తాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎంత కేర్ ఫుల్ గా ఉన్నా కొన్ని మిస్టేక్స్ చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

ఎస్ఈసీతో : YS jagan

ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిలా కాకుండా వ్యక్తిగతంగా ఇగో ఫీలైనట్లు ఈ మొత్తం ఎపిసోడ్ ని పరిశీలిస్తే అర్థమవుతుంది. సీఎంగా ఉన్నప్పుడు ఆవేశంతో కాకుండా ఆలోచనతో రాజ్యాంగ నిపుణుల్ని సంప్రదించాకే నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది అనిపించింది.

కనీసం..

జగన్ గవర్నమెంట్, అందులోని ఉన్నతాధికారులు చేపట్టే చర్యలు కొన్నిసార్లు అడ్డంగా దొరికిపోతున్నాయి. నిమ్మగడ్డను తీసేసి కనగరాజ్ ని ఎస్ఈసీగా తేవటం దీనికి తిరుగులేని ఉదాహరణ. తాజాగా ఏకగ్రీవాలకు సంబంధించి విడుదల చేసిన ప్రకటనలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. ఏపీ రాజముద్రకు బదులు తెలంగాణ ఎంబ్లమ్ పెట్టడం చాలా సిల్లీగా అనిపిస్తోంది. అంత పెద్ద చదువులు (ఐఏఎస్.. ఐపీఎస్..) చదివినోళ్లు, అనుభవం కలిగినోళ్లు ఆ మాత్రం వెరిఫికేషన్ కూడా చేసుకోరా అని డౌట్ వస్తోంది.

చుక్కెదురు..

ఎంత ముఖ్యమంత్రి అయినా ఆయనకూ కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ మాటకొస్తే ప్రధానికి కూడా ఉంటాయి. రాజ్యాంగ వ్యవస్థలు ఏవైనా వాటి ముందున్న లక్ష్మణ రేఖను దాటకుండా ఉన్నంత వరకే గౌరవం, మర్యాద. అది దాటితే ఇక ఎక్కడైనా, ఎవరి చేతిలోనైనా చుక్కెదురు కాకతప్పదు. ఆ చిన్న తేడాని కూడా సీఎం జగన్ కి చెప్పేవారు లేరా అనిపిస్తోంది. సలహాదారులు బోలెడంత మంది ఉన్నా చివరికి ఒక న్యూస్ పేపర్ లో ఇచ్చిన యాడ్ లో కూడా తప్పు జరిగిపోవటం జగన్ సర్కారును నవ్వుల పాల్జేస్తోంది.

YS-jagan-will-have-to-take-more-care
YS-jagan-will-have-to-take-more-care

అసహనం: YS jagan

వరస ఎదురుదెబ్బలతో వైఎస్ జగన్ లో, ఆయన మంత్రుల్లో అసహనం పెరిగిపోతోందనే ఫీలింగ్ ప్రజలకు కలుగుతోంది. దీంతో ఎస్ఈసీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముందే మన హద్దులేంటో తెలుసుకొని ప్రవర్తిస్తే ఇలాంటి పరిస్థితి రాదు కదా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఇగోలకు పోకుండా వాస్తవాలకు అనుగుణంగా వ్యవహరిస్తే రాజకీయాలు గానీ పరిపాలన గానీ రాజ్యాంగ సంక్షోభం దాకా పోనే పోవు.

Advertisement