YS jagan : పార్లమెంట్ సాక్షిగా జగన్ ఘన విజయం? ఎప్పటి నుంచో ఎదురుచూస్తోంది ఏపీకి రాబోతోంది?

YS jagan : ‘విశాఖ ఉక్కు’ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే మాట ‘ఆంధ్రుల హక్కు’. ఆ హక్కుకి బొక్కలు పొడవటానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పన్నాగం పన్నుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ కు అమ్మేయటానికి ఎత్తులు వేస్తోంది. నష్టాల సాకు చూపి నట్టేట ముంచటానికి రంగం సిద్ధం చేస్తోంది. సంబంధిత బిల్లును రేపో మాపో పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.

హిట్ లిస్ట్..

కొన్ని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని గవర్నమెంట్ పెట్టుబడులను విత్ డ్రా చేసుకోవటానికి మోడీ ప్రభుత్వం చానాళ్లుగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ లిస్టులో ఇప్పటివరకు ఎల్ఐసీ, ఎయిరిండియా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారత్ పెట్రోలియం, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటివి ఉండగా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కూడా చేర్చబోతున్నారు.

బడ్జెట్ లో: YS jagan

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెంట్రల్ బడ్జెట్ ప్రతిపాదనలను ఫిబ్రవరి 1న  పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ప్రైవేటీకరించబోయే సంస్థల జాబితాను కూడా ఇందులో పొందుపరుస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలోనూ ఈ టాపిక్ చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వార్తలే నిజమైతే జగన్ పార్టీకి పంట పండినట్లేనని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

ఎందుకు?..

ఏపీకి అమరావతి సహా మూడు రాజధానులను తెరపైకి తెచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. అందులో ఒకటి వైజాగ్ లో కూడా పెట్టనుంది. మొత్తం పరిపాలననే విశాఖపట్నం నుంచి సాగించాలనుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైజాగ్ స్టీల్ ని అమ్మాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ‘పథకానికి’ అస్సలు ఒప్పుకోరనే విషయాన్ని కళ్లు మూసుకొని కూడా చెప్పొచ్చు. ఈ మేరకు ఆయన పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో పోరాడతారు.

YS-jagan-will-get-success-from-parliament-to
YS-jagan-will-get-success-from-parliament-to

తిరుపతిలోనూ: YS jagan

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పెత్తనంలోకి పోనీయకుండా ఉద్యమించడంలో ఏపీలోని అధికార పార్టీ ఉక్కు సంకల్పాన్ని ప్రదర్శిస్తుందనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ దిశగా జగన్ చేయబోయే ఆందోళనలు, నిరసనలు వైఎస్సార్సీపీకి పార్లమెంట్ సాక్షిగా ఘన విజయం కట్టబెట్టనున్నాయి. అంతేకాదు. తిరుపతి బై ఎలక్షన్ మొదలుకొని దాదాపు అన్ని ఎన్నికల్లోనూ కలిసి రానున్నాయి.

Advertisement