YS JAGAN vs SOMU VEERRAJU : జగన్ పార్టీకి మూడింది? ఏపీకి కిషన్ రెడ్డిని రప్పించబోతోన్న సోము వీర్రాజు?

YS JAGAN vs SOMU VEERRAJU : ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలు అధికారికంగా పార్టీలకి రహితంగానే జరుగుతున్నాయి గానీ అనధికారికంగా మాత్రం వైఎస్సార్సీపీ, టీడీపీబీజేపీ మధ్య విమర్శలు-ప్రతివిమర్శలు, ఆరోపణలు-ప్రత్యారోపణలు, దాడులు-ప్రతిదాడులు, ఫిర్యాదులు-ప్రతీకారాల దాకా దారితీస్తున్నాయి. ప్రతిపక్షాలు మద్దతిచ్చే అభ్యర్థులు కనీసం ప్రశాంతంగా నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదనే వరకు పోతున్నాయి.

బాబోయ్..

పంచాయతీ ఎలక్షన్ బరిలో నిలవాలనుకునుకుంటే అధికార పార్టీ సపోర్ట్ ఉన్నోళ్లకే సాధ్యమౌతోందని, మిగతావాళ్లకు అదో పెద్ద ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా మారిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్న(బుధవారం) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యర్థుల్ని వైఎస్సార్సీపీవాళ్లు అడ్డుకుంటున్నారని, బెదిరింపులకు, కిడ్నాపులకు పాల్పడుతున్నారని, పది రకాల తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

సమస్యాత్మకం: YS JAGAN vs SOMU VEERRAJU

వైఎస్ జగన్ పాలనలో నామినేషన్ వేయటం కూడా ఒక సమస్యగా మారిందని సోము ఆవేదన వెలిబుచ్చారు. ఎన్నికల ప్రకటన జారీ అయ్యాక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కి కోపరేట్ చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. గెలిచే అవకాశం ఉన్న ఇతర పార్టీల మద్దతు గల క్యాండిడేట్లని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ బలవంతపు ఏకగ్రీవాలకి పాల్పడుతున్నారని కమలదళాధినేత ధ్వజమెత్తారు.

ఎందుకీ పాట్లు?..

పంచాయతీ ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ ఇన్నాళ్లూ బీరాలు పలికిన వైఎస్సార్సీపీ ఇప్పుడెందుకు ఇలాంటి నీచమైన రాజకీయాలకు దిగుతోందో అర్థం కావట్లేదని వీర్రాజు ఎద్దేవా చేశారు. అంత దమ్మున్న పార్టీయే అయితే అడ్డదారులు తొక్కటం దేనికి అని నిలదీశారు. ఏకగ్రీవాలనేవి ప్రజల ఇష్టపూర్తిగా జరిగాలి తప్ప కష్టంగా కాదని హితవు పలికారు.

YS JAGAN vs SOMU VEERRAJU : ap bjp complaint to central home ministry
YS JAGAN vs SOMU VEERRAJU : ap bjp complaint to central home ministry

నాథుడేడి?: YS JAGAN vs SOMU VEERRAJU

వైఎస్సార్సీపీ బ్యాంక్ గ్రౌండ్ ఉన్నోళ్లు తప్ప ఇతరులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ ఊసెత్తితే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని, ఎదురుతిరిగినోళ్లపై రౌడీ షీట్లు తెరుస్తున్నారని సోము అసహనం ప్రదర్శించారు. రాష్ట్రంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా, ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడని దుయ్యబట్టారు. ఈ అరాచకాల్ని ఇప్పటికే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి చెప్పామన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగితే జగన్ పార్టీ వైఎస్సార్సీపీకి మూఢినట్లేనని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

Advertisement