YS Jagan vs Nimmagadda : జగన్ పార్టీ మీద నిమ్మగడ్డ మరోసారి రెచ్చిపోతాడేమో??

YS Jagan vs Nimmagadda : ఏపీలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎక్కువ తక్కువ చేయకుండా అడుగడుగునా చెక్ పెట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఇప్పుడు మరో ఛాన్స్ దొరికింది. వైఎస్సార్సీపీ నాయకులు తిరుమల శ్రీవారి ప్రసాదంతో ఎలక్షన్ ప్రచారం నిర్వహిస్తున్నారంటూ తెలుగుదేశం, బీజపీ వంటి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీనికి ఆధారంగా ఒక వీడియోను కూడా విడుదల చేశాయి. దీంతో నిమ్మగడ్డ జగన్ పార్టీ మీద మళ్లీ రెచ్చిపోతాడేమోనని, కఠిన చర్యలు తీసుకుంటాడేమోనని భావిస్తున్నారు.

చంద్రగిరిలో..

రేపు ఆదివారం నాలుగో దశ పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలోని కొన్ని ఊళ్లల్లో నిన్న శుక్రవారం కొంత మంది అభ్యర్థులు ఓటర్లకు వల వేసేందుకు తిరుమల లడ్డూలను, వడలను పంచుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరకటం వివాదాస్పదంగా మారింది. తొండవాడ పంచాయతీలో అధికార పార్టీ సపోర్ట్ తో పోటీలో నిలిచిన క్యాండిడేట్ ఇంటింటికీ తిరిగి రేషన్ బియ్యం పంపిణీ చేశాడు. దీంతోపాటు ఏడుకొండలవాడి ప్రసాదాన్ని కూడా చిన్న చిన్న సంచుల్లో పెట్టి పంచారు. ఆ బ్యాగులకు అభ్యర్థి ఎన్నికల గుర్తు కూడా ముద్రించి ఉండటం గమనార్హం.

తిరుచానూరులో: YS Jagan vs Nimmagadda

తిరుచానూరు ప్రాంతంలోని కొన్ని కాలనీల్లో పొద్దుపొద్దున్నే మూడు నాలుగు గంటల సమయంలో చిన్న లడ్డూలు, కళ్యాణ లడ్డూలు, వడలు సైతం ఇచ్చారు. ఒక గ్రామంలో అయితే ఏకంగా పంచాయతీ ఉద్యోగే ఇందులో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీనిపై నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని చిత్తూరు జిల్లా కలెక్టర్ కి, ఎస్ఈసీకి ఇప్పటికే కంప్లైంట్లు చేసినట్లు సమాచారం. పాకాల, మొగరాల, ఉప్పరపల్లితోపాటు చంద్రగిరి, తొండవాడ, ముంగిలిపట్టు తదితర పల్లెల్లో ఓటర్ల ఇళ్లకు పదుల సంఖ్యలో ప్రసాదాలు అందినట్లు చెబుతున్నారు.

YS Jagan vs Nimmagadda : sec nimmagadda will take serious action on ys jagan party
YS Jagan vs Nimmagadda : sec nimmagadda will take serious action on ys jagan party

ఆఫీసర్లపైనే..

తిరుమల కొండ మీద వందల కొద్ది లడ్డూలు, వడలు కొనాలంటే అయ్యే పనికాదు. అలాంటప్పుడు ఇన్నిన్ని ప్రసాదాల సంచులు ఎలా వచ్చాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆఫీసర్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్ల కోపరేషన్ లేకపోతే ఇది సాధ్యం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. వేల సంఖ్యలో ఓటర్లు ఉండగా ఒక్కో కుటుంబానికి 5, 10 చోప్పున లడ్డూలు, వడలు ఇవ్వటమంటే మాటలు కాదని, ఈ తతంగం వెనక ఎవరో పెద్దలే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రంగంలోకి దిగితే గానీ ఈ గుట్టు రట్టు కాదని అంటున్నారు.

Advertisement