YS Jagan : వైఎస్ జగన్ కి సంబంధించిన ఈ విషయాలు వెరీ ఇంట్రస్టింగ్ అండ్..

YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఒక అంశం ఆసక్తికరంగా అనిపిస్తోంది. అదే సమయంలో వివాదాస్పదంగా కూడా మారుతోంది. ఏప్రిల్ నెలలో ఏపీ ప్రభుత్వం అమలుచేయబోయే కొన్ని ముఖ్య కార్యక్రమాల వివరాలను (తేదీల వారీగా) అధికార పార్టీ ఒక క్యాలెండర్ రూపంలో డిజైన్ చేసింది. ఆ డేట్లను సీఎం వైఎస్ జగనే ప్రకటించారని పేర్కొంది. ఏప్రిల్ 6వ తేదీన వైఎస్సార్ భీమా, 9వ తేదీన జగనన్న విద్యా దీవెన, 13వ తేదీన తెలుగు సంవత్సరాది (ఉగాది) నాడు గ్రామ వాలంటీర్లకు సత్కారం, 16వ తేదీన రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ, 20వ తేదీన డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ సున్నా వడ్డీ, ఏప్రిల్ 27న జగనన్న వసతి దీవెన వంటి పథకాల కింద లబ్ధిదారులకు సర్కారు డబ్బులు ఇవ్వనుంది. నవరత్నాల్లో భాగంగా వీటిని వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఒకదాని తర్వాత ఒకటి చొప్పున ప్రారంభించింది.

ఏ యావ ఉన్నోడికి ఆ యావే

ఏపీలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశానికి ఎప్పుడూ జగన్ ని విమర్శించటమే పని కదా. ఆయన ఏం చేసినా తప్పుపడుతూ ఏదో ఒకదానికి లంకె పెడుతూ ఆ పార్టీ ఒక రకమైన ఆనందం పొందుతోంది. ఇందులో భాగంగా జగన్ కి లేటెస్ట్ కౌంటర్ అన్నట్లు పోటా పోటీగా తానూ ఒక వెరైటీ క్యాలెండర్ ని విడుదల చేసింది. అందులో జగన్ ఈడీ, సీబీఐ కోర్టులకు వెళ్లాల్సిన తేదీలను వారాలతో సహా రిలీజ్ చేసింది. ఏప్రిల్ 6, 13, 20, 27 (ఈ నాలుగు రోజులూ మంగళవారాలే), ఏప్రిల్ 9, 16, 23(ఈ మూడు రోజులూ శుక్రవారాలే) తేదీల్లో సీఎం జగన్ కోర్టుల్లో విచారణలకు హాజరవ్వాల్సి ఉందని టీడీపీ గుర్తు చేసింది.

YS Jagan : tdp negative campaign on ap cm ys jagan
YS Jagan : tdp negative campaign on ap cm ys jagan

కోర్టులకు టోపీ?: YS Jagan

న్యాయస్థానాల్లో విచారణలకు హాజరు కావాల్సి వ్యక్తి సరిగ్గా అవే తేదీల్లో పథకాల అమలు పేరుతో కోర్టులకు వెళ్లకుండా తప్పించుకుంటున్నాడంటూ నెగెటివ్ ప్రచారం మొదలు పెట్టింది. స్కీమ్ లను సాకుగా చూపి న్యాయస్థానాలను మోసం చేస్తున్నాడని, అసలు అతనికి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయని సెటైర్ వేసింది. అయితే.. కోర్టులను మోసం చేస్తున్నాడనేది మాత్రం వివాదాస్పద అంశమే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి తెలిసిన ఈ విషయాలు సీబీఐకి, ఈడీకి తెలియవా?. పోనీ.. వాళ్లకు తెలియకపోతే టీడీపీవాళ్లైనా ఇవ్వొచ్చు కదా (ఇస్తారు కూడా) అని వైఎస్సార్సీపీవాళ్లు అంటున్నారు. అ పని చేయకుండా ఇలా సోషల్ మీడియాలో పెట్టడం దేనికి? అని అడుగుతున్నారు. వాళ్ల జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా తనపై ఎవరు ఏ కేసు పెట్టినా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నాడు కదా. అతనూ న్యాయస్థానాలను మోసం చేస్తున్నాడా అని నిలదీస్తున్నారు. తప్పు చేయనప్పుడు స్టే తెచ్చుకోవటం దేనికి?. ధైర్యంగా విచారణ ఎదుర్కోవచ్చుగా అని అధికార పార్టీవాళ్లు సూటిగా కౌంటర్ వేశారు.

Advertisement