Nimmagadda: సుప్రీమ్ కోర్టు చెప్పినా నిమ్మగడ్డ ఓడిపోయేలా జగన్ మాస్టర్ బ్లాస్టర్ స్కెచ్.. !

Nimmagadda (నిమ్మగడ్డ) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు పంచాయతీ ఎన్నికల విషయంలో ఎవరి మాట వినే పరిస్థితిలో కనిపించడం లేదనే చెప్పాలి. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు వద్దు అని వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికలు నిర్వహించామని నివేదిక వెలువడింది. దీనిపై సవాల్ చేస్తూ ప్రభుత్వం హై కోర్టులో పిటిషన్ వేసింది . హైకోర్టుపై నమ్మకం ఉందని, కోర్టు ఎలాంటి తీర్పు చెప్పినా పాటిస్తామని మాటిచ్చారు కూడా. కానీ తీర్పు వెలువడిన తరువాత హైకోర్టు తీర్పును కనీసం పరిగణనలోకి తీసుకోలేదు.ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వనికి అనుకూల తీర్పు వస్తే మళ్ళీ న్యాయవ్యవస్థను పొగిడి,నిమ్మగడ్డ పదవి కాలం పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. అయితే మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వంకు వ్యతిరేక తీర్పు వస్తే? ప్రభుత్వం ఏమి చేస్తుంది. మళ్ళీ ఎన్నికల నిర్వహణకు సహకరిస్తుందా..?లేదంటే ఎన్నికలు లేవని అడ్డగోలుగా ప్రవర్తిస్తుందా.. అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇక్కడ గమనించాలిసిన విషయం ఏంటంటే.. కోవిడ్ ప్రారంభమైన తర్వాత కనీసం ఆరు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు పడ్డాయి.కానీ అన్నింటిలోనూ సుప్రీంకోర్టు ఒకేలాంటి తీర్పు ఇచ్చింది. ఎట్టి పరిస్థితులలో స్థానిక ఎన్నికలు జరగాల్సిందేనని తేల్చింది. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎన్నికలు వద్దని మళ్ళీ సుప్రీమ్ ను ఆశ్రయించింది. అయితే సీఈసీకి ఉన్నన్ని అధికారాలు ఎస్‌ఈసీకి కూడా ఉంటాయని పలుమార్లు కోర్టులు కూడా తీర్పులు ఇచ్చాయి. దీనిని బట్టి చుస్తే సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్‌ మళ్ళీ వైఫల్యం పాలవుతందని చెప్పొచ్చు.

Ys jagan superb plan about nimmagadda నిమ్మగడ్డ
Ys jagan superb plan about nimmagadda

ఎస్‌ఈసీ నోటిఫికేషన్ వివరాల ప్రకారం సోమవారం ఉదయం 10 గంటలకు రిటర్నింగ్ అధికారులు అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్లు జారీ చేసి, అలాగే నామినేషన్లు స్వీకరించడం ప్రారంభించాలి. కానీ సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ వేసిన పిటిషన్ పదకొండు గంటల తర్వాత విచారణకు వస్తుంది. అయితే నోటిఫికేషన్ కి పిటిషన్ కి కేవలం ఒక్క గంట మాత్రమే తేడా ఉంది. అంటే నోటిఫికేషన్లు జారీ చేయకపోతే.. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లుగానే అనుకోవాలి.

ఒకవేళ సుప్రీంకోర్టు కూడా ఎస్‌ఈసీకి అనుకూలంగానే తీర్పు ఇచ్చినా గాని ప్రభుత్వం దానిని అమలు చేయడానికి సిద్ధమవుతుందా? లేదా? అన్నది మరో ప్రశ్న. దీనికి కారణం లేకపోలేదు ఎందుకంటే ఎన్నికలు నిర్వహించకూడదన్నదే ఏపీ సీఎం జగన్ పట్టుదల.అసలు ఏపీకి సీఎం నేనా… లేక నిమ్మగడ్డ రమేష్ కుమారా అన్నది జగన్ పంతం. తాను చెప్పినట్లు జరగాలని జగన్ మొండి పట్టుదల.ఒక వేళ సుప్రీంకోర్టు ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన, ఎన్నికల నిర్వహణకు సహకరించకపోతే మాత్రం అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. మరి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది వేచి చూడాలి.

Advertisement