YS Jagan : ఫ్లాష్.. ఫ్లాష్.. : వైఎస్ జగన్ కుడి భుజంపై నిమ్మగడ్డ యాక్షన్?

YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుడి భుజం సజ్జల రామకృష్ణారెడ్డి అని ఆయన ఫ్యాన్స్ చెప్పుకుంటూ ఉంటారు. సజ్జల గతంలో సాక్షి సంస్థకు ఎడిటోరియల్ డైరెక్టర్(ఈడీ)లా, జగన్ కి రాజకీయ కార్యదర్శిగా, ఇప్పుడు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఆయనపై చర్యలు తీసుకోవాలని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ(శుక్రవారం) రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కి లేఖ రాశారు.

ఎందుకు?..

సజ్జల ఓ వైపు ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ మరో వైపు రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని, తద్వారా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని నిమ్మగడ్డ గవర్నర్ కి కంప్లైంట్ ఇచ్చారు. తన పైన, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పైన సజ్జల చేస్తున్న విమర్శలను ఆయన ఆ లేఖలో పొందుపరిచారు. ఎలక్షన్ కోడ్ ఉండగా లక్ష్మణ రేఖ దాటిన రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయి రెడ్డిలపై కోర్టుకి వెళ్లనున్నానని, న్యాయస్థానానికి వెళ్లే ముందు ఆ విషయాన్ని మీకూ తెలియజేయాలనే ఉద్దేశంతో లేఖ రాస్తున్నానని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.

ప్రవీణ్ పై: YS Jagan

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, సీఎం జగన్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరుతూ నిమ్మగడ్డ అంతకుముందే సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కి లెటర్ పంపారు. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ జరక్కుండా అడ్డుకోవటమే కాకుండా ఆఫీసర్లను ఎలక్షన్ డ్యూటీకి రెడీ చేయటంలో ఫెయిల్ అయ్యారని ప్రవీణ్ ని తప్పుపట్టారు. ఆయన వల్ల పంచాయతీ ఎన్నికలు సకాలంలో ప్రారంభం కాలేదని, రీషెడ్యూల్ చేయాల్సి వచ్చిందని చెప్పారు.

YS Jagan : sec-nimmagadda-complaint-on-jagan-advisor
YS Jagan : sec-nimmagadda-complaint-on-jagan-advisor

నో ‘జగన్’..

క్యాస్ట్ సర్టిఫికెట్లు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల(ఎన్వోసీల)పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటోలు పెట్టొద్దని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ ఆదిత్యనాథ్ దాస్ కి రాసిన మరో లెటర్ లో సూచించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను సకాలంలో ఇవ్వాలని, ఈ విషయంలో ఎలాంటి వివక్షా చూపొద్దని పేర్కొన్నారు.

Advertisement