బిగ్ బ్రేకింగ్: జగన్ కి పవన్ సీరియస్ వార్నింగ్ – జగన్ రియాక్షన్ ఇదే ?

మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైస్ జగన్ పై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. తమ చేతిలో అధికారం వుంది కాబట్టి ఏది చేసిన చెల్లుతుంది అనే ధోరణి పట్ల జగన్ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మనోభావాలను కించపరిచేలా వైస్ జగన్ ప్రవర్తన ఉందంటూ సీరియస్ అయ్యారు జనసేనాని. కర్నూలు జిల్లా మంత్రాలయం మఠం భూములను వేలం వేయాలని చూస్తున్న య జగన్ చర్యలను తెలుగు ప్రజలంతా గమనిస్తున్నారని గుర్తు చేశారు.

Pawan vs Jagan

పవన్ కళ్యాణ్ ఈ విషయాన్నీ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వెల్లడించాడు. మంత్రాలయం మఠం పరిధిలో ఉన్న 208 ఎకరాల భూములను అమ్ముకోవాలనుకోవడం పట్ల జనసేన పూర్తి వ్యతిరేఖంగా ఉందంటూ పేర్కొన్నారు. దేవాదాయ శాఖ పరిధిలో గల భూములకు వైస్ జగన్ ప్రభుత్వం కేవలం ట్రస్టీ మాత్రమే అని అమ్ముకోవడానికి హక్కు లేదని పేర్కొన్నారు. ఆస్తులను సంరక్షించడం ఒక ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యత అని అది మరిచిపోయి ఇలా దేవుడి భూములను అమ్మడం విడ్డూరం అంటూ ఎద్దేవా చేసారు. ఇక ఇప్పటికే తిరుమల దేవస్థానం భూములను అమ్మాలనుకున్నప్పుడు కూడా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేఖత రావడం తో ప్రభుత్వం వెనక్కి తగ్గిన విషయాన్నీ పవన్ కళ్యాణ్ గుర్తు చేసారు. ఇక ఇప్పుడు అయినా కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి అంటూ ఆగ్రహించారు జనసేనాని.

పట్టించుకోని వైస్ జగన్

టీటీడీ ఆస్తుల విక్రయాన్ని ఆపేస్తు జీవో 888ను వైస్ జగన్ విడుదల చేసారు. ఈ నిలుపుదల ఉత్తర్వూలను రాష్ట్రం లో ఉండే అన్ని ఆలయాలకు, వాటి సంబంధిత ఆస్తులకు, భూములకు వర్తింప చేయాలనీ అయన కోరారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పాలకులు ఒత్తిడి చేసి భూములను వేలం వేయడం, దాతలు ఆలయాల రక్షణ కోసం ఇచ్చిన ఆస్తులను అమ్ముకోవాలని చూడటం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ లో దూమారం చెలరేగుతున్న నేపథ్యంలో వైస్ జగన్ మాత్రం ఈ విమర్శలను పట్టించుకున్నట్టుగా కనిపించడం లేదు. అయన నిర్ణయం తీసుకున్న మేరకే మంత్రాలయం భూములను వేలం వేసే ప్రక్రియ కొనసాగేలా కనిపిస్తుంది.

Advertisement