YS Jagan: సిమ్లాలో దిగిన జ‌గ‌న్.. ఐదు రోజుల పాటు ఫ్యామిలీతో అక్క‌డే స్టే

YS Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిత్యం అనేక కార్య‌క‌లాపాల‌తో ఎంత బిజీగా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే ఆ బిజీ వ‌ర్క్స్‌కి షార్ట్ బ్రేక్ ఇవ్వాల‌ని అనుకున్నారు జ‌గ‌న్. సీఎం అయన తరువాత ఆయన తన కుటుంబ సభ్యులకు సమయం కేటాయించలేకపోతున్నారు. అందుకే కొన్ని రోజులు అన్నింటికీ దూరంగా ఉండి.. కుటుంబానికి సమయం కేటాయించాలని నిర్ణయించారు.


YS Jagan reached to Shimla with Family
YS Jagan reached to Shimla with Family


ఈ నెల 28న సీఎం జగన్- వైఎస్ భారతిరెడ్డిల 25వ పెళ్లి రోజు. దీంతో వివాహ వార్షికోత్సవం సిల్వర్ జూబ్లీ నేపథ్యంలో 5 రోజుల పాటు సీఎం జగన్ తన కుటుంబంతో గడపనున్నారు. ఇందులో భాగంగా నార్త్ ఇండియా టూర్ వెళ్లారు. గురువారం మధ్యాహ్నం 12.30 కు తాడేపల్లి లోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్క‌డ‌ నుంచి చండీగఢ్ బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి సిమ్లాలోని ఒబెరాయ్ హోటల్ కు చేరుకున్నారు.


ఈనెల 30న కానీ 31న ఆయన తిరిగివచ్చే అవకాశముంది. 2019 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం జగన్ కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లారు. అలాగే జెరూసలెం యాత్రకు కూడా వెళ్లారు. నిజానికి ఈసారి కూడా ఆయన విదేశీ పర్యటనకు వెళ్లాలని భావించిన కొవిడ్ దృష్ట్యా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. సీఎం జగన్ తొలుత యూరప్ పర్యటనకు వెళ్తారన్న ప్రచారం జరిగింది. కానీ సిమ్లా టూర్ వెళ్తున్నట్లు ప్రకటించారు.


ఎయిర్‌పోర్ట్‌లో జ‌గ‌న్ స‌రికొత్త లుక్ లో క‌నిపించారు. మెడ‌ల్ స్వెట్ట‌ర్‌ని స్టైలిష్‌గా వేసుకొని ట్రెండీ లుక్‌లో క‌నిపించారు. ఐదు రోజుల పాటు సీఎం జగన్ తన అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నారు.