ఏపీ లోకి అడుగు పెట్టకముందే ఒవైసీ ని పోలిటికల్ గా తోక్కెసే ప్లాన్ వేసిన జగన్ ?

సుల్తాన్ స‌లావుద్దీన్ ఓవైసీ ఏర్పాటు చేసిన మజ్లీస్ పార్టీ క్రమంగా వారసుల చేతిలోకి వచ్చి దేశ వ్యాప్తంగా విస్తరించుకుంటుంది. తాజాగా బీజేపీ మంచి దూకుడు మీద ఉన్న బీహార్ ఎన్నికల్లో, సీమాంచ‌ల్ ప్రాంతంలో 5 కీలక స్థానాల్లో విజయకేతనం ఎగరవేసి ముస్లిం మైనార్టీ వ‌ర్గాలు దేశవ్యాప్తంగా తమవైపు చూసేలా చేసాయి. 2015 లో ఘోరంగా పరాజయం చవి చూసినప్పటికీ అనూహ్యంగా పుంజుకొని విజయం దక్కించుకోవడం వల్ల ఎంఐఎం దూకుడు మామూలుగా లేదు. అందుకే దేశవ్యాప్తంగా పోటీ చేసి తామ సత్తా చూపాలనుకుంటున్న విషయం ఎంఐఎం అధినేత ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ ఒక ప్రెస్ మీట్ లో తెలిపారు.

asaduddin owaisi

ఏపీలోనూ ‌సత్తా చాటాలని

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటి వరకు ఒక మైనార్టీ పార్టీ అంటూ లేకపోయినా కీలక నియోజకవర్గాల్లో ముస్లిం ఓటు బ్యాంకు మాత్రం బాగానే ఉంది. అందువల్ల ఇప్పుడు అస‌దుద్దీన్ ఒవైసీ కన్ను ఏపీ పై పడింది. ఒక్క ఏపీలోనే కాదు బెంగాల్‌, యూపీ ఎన్నిక‌ల్లోనూ ఎంఐఎం పోటీ చేయనుంది. ఇక ముందు నుండి ఏపీ తో మజ్లీస్ పార్టీ కి మంచి అనుబంధం ఉంది. అప్పట్లో వైస్సార్ కి ఒవైసి మంచి మిత్రుడు కూడా. 2024 నాటికి ఎంఐఎం ఏపీకి వస్తే పార్టీకి బాగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయ్. అంతే కాదు అక్కడ మజ్లీస్ కి మంచి నాయకత్వం ఉంది.

జగన్ తో మజ్లీస్ కి పోటీ

ఈ నేపథ్యంలో జగన్ దోస్తీ తో కటీఫ్ చెప్పి ఏపీలో పోటీ చేస్తే అక్కడ కేడ‌ర్ కి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని ఒవైసి భావిస్తున్న, జగన్ ఈ ప్రణాలికను ముందుకు తీసుకెళ్లకుండా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. మైనార్టీ వర్గాల్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్న, సత్తా ఉన్న నాయకులను ముందుగానే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కి దింపి వారికి పదవులు కట్టబెట్టడం ద్వారా ఎంఐఎం వైపు ఎవరు తొంగిచూడరు అని జగన్ అంచనా వేస్తున్నట్టు తెలుస్తుంది.

Advertisement