Jagan: హెలికాఫ్ట‌ర్ షాట్ ఆడిన జ‌గ‌న్.. నీ దూకుడికి సాటెవ్వరు అంటున్న నెటిజ‌న్స్

Jagan: క్రికెట్‌లో హెలికాఫ్టర్ షాట్ ఎవ‌రు ఆడ‌తారు అంటే ఠ‌క్కున ఎంఎస్ ధోని అని ఎవ‌రైన చెబుతారు. ఇప్పుడు ఈ షాట్‌ని ప‌లువురు యువ క్రికెట‌ర్స్ ఆడుతూ మైమ‌ర‌పిస్తున్నారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వైఎస్ రాజారెడ్డి హెలికాఫ్ట‌ర్ షాట్ ఆడి నీ దూకుడికి సాటెవ్వ‌రు అని నిరూపించారు. శుక్రవారం ఏసీఏ క్రికెట్ స్టేడియం అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఫ్లడ్ లైటింగ్ పనులకు శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా బ్యాట్ పట్టిన సీఎం వైఎస్ జగన్ రెండు బంతులు ఆడి అభిమానుల్ని అలరించారు.

Jagan

కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి బౌలింగ్ చేయగా… సీఎం జగన్ బ్యాటింగ్ చేశారు. బౌండరీలు బాదకపోయినా.. మంచి షాట్లే ఆడారు ముఖ్యమంత్రి. అనంతరం బ్యాట్, బంతిపై ఆయన సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) పెద్దలు, భారత మాజీ క్రికెటర్, తెలుగు కామెంటేటర్ వేణుగోపాల్ రావు పాల్గొన్నారు. ఇక మైదానంలో వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల విగ్రహాలను ఆవిష్కరించిన జగన్.. ఫొటో గ్యాలరీని తిలకించారు.

ఆంధ్ర నుంచి ఐపీఎల్‌ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ఎంపికైన కడప జిల్లాకు చెందిన హరిశంకర్ రెడ్డి గురించి ఏసీఏ అధికారులు సీఎం జగన్‌కు తెలియజేశారు. అతనికి సంబంధించిన ఫొటోలను చూపించారు. 14 ఏళ్ళ క్రితం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తన తండ్రి రాజారెడ్డి జ్ఞాపకార్థం రూ.50 లక్షలతో 2007లో స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.10 కోట్లతో స్టేడియం నిర్మాణం 2010 లో పూర్తయ్యింది.. ఇప్పటికే ఇక్కడ క్రికెట్ క్రీడాకారులకు శిక్షణ తో పాటు రంజీ క్రికెట్ మ్యాచులు నిర్వహిస్తున్నారు.

భవిష్యత్తులో డే నైట్ మ్యాచుల నిర్వహణ కోసం ఫ్లడ్ లైటింగ్ ఏర్పాటుకు బీసీసీఐ నిర్ణయించింది.. రూ. 4 కోట్ల వ్యయంతో ఫ్లడ్ లైట్స్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఇక్కడ దేశవాళీ మ్యాచ్‌లు జరుగుతుండటంతో పాటు పలువురు క్రికెటర్ల శిక్షణ కూడా తీసుకుంటున్నారు. అయితే డే అండ్ నైట్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు వీలుగా సుమారు రూ.4 కోట్ల నిధులతో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ పనులకు శంకుస్థాపన చేశారు.

అతి త్వ‌ర‌లో ఈ మైదానానికి అంత‌ర్జాతీయ హోదా ద‌క్క‌నున్న‌ట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియాలు మాత్రమే అంతర్జాతీయ హోదాను కలిగి ఉన్నాయి. ఈ స్టేడియాన్ని వ‌చ్చే ఐపీఎల్ సీజన్ వరకైనా అందుబాటులోకి తేవాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్దలు భావిస్తున్నారు.