YS Jagan Mohan Reddy : సీఎం జగన్ ఔదార్యం: చిన్నారి వైద్య చికిత్స కోసం కోటి మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం.!

NQ Staff - October 3, 2022 / 03:16 PM IST

YS Jagan Mohan Reddy  : సీఎం జగన్ ఔదార్యం: చిన్నారి వైద్య చికిత్స కోసం కోటి మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం.!

YS Jagan Mohan Reddy  : వైఎస్ జగన్ ప్రభుత్వం, ఓ చిన్నారి వైద్య చికిత్స కోసం కోటి రూపాయలు మంజూరు చేసింది. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించినప్పుడు తన రెండేళ్ళ కుమార్తె హనీ అనారోగ్య పరిస్థితిని గురించి ముఖ్యమంత్రి వద్ద చెప్పుకుని సాయం కోసం అర్థించాడో తండ్రి.

తన కుటుంబ ఆర్థిక పరిస్థితి, తన కుమార్తె అనారోగ్య పరిస్థితి గురించి ఆ తండ్రి ఆవేదనాభరితంగా ముఖ్యమంత్రికి వివరించడంతో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆ కుటుంబానికి భరోజా ఇచ్చారు.

ఇంజక్షన్ ఖరీదు 1.25 లక్షలు..

ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు లక్షా పాతిక వేలు. అలాంటివి 13 ఇంజెక్షన్లను ఇప్పటికే జిల్లా కలెక్టర్ హిమాన్షు కౌశిక్, బాధిత కుటుంబానికి అందజేశారు. మొత్తం 52 ఇంజెక్షన్లు హనీ వైద్య చికిత్స కోసం అవసరమవుతాయి. ప్రతి 15 రోజులకు ఓ సారి ఈ ఇంజెక్షన్ చేయించాల్సి వుంటుంది.

ఈ నేపథ్యంలో కోటి రూపాయల్ని వైఎస్ జగన్ ప్రభుత్వం, బాధిత చిన్నారి వైద్య చికిత్స కోసం కేటాయించడం జరిగింది. 50 వేల నుంచి లక్ష మంది జనాభాలో ఒకరికి అరుదుగా ఈ గౌషర్ అనే వ్యాధి సంక్రమిస్తుంది.
కాగా, ప్రభుత్వ సానుకూల స్పందన పట్ల హనీ కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది.

Read Today's Latest Andhra pradesh in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us